కరెంట్ మంత్రికి షాకిచ్చిన నిర్ణయం

ఈసీ నిర్ణయంతో నో ఎంట్రీ..

రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట్లకండ్ల జగదీశ్వర్ రెడ్డికి ఈసీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న క్రమంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఆయనపై నిషేధం వేటు వేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రే సొంత జిల్లాలో ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తయారైంది. అత్యంత కీలకమైన రెండు రోజులూ ప్రచారానికి దూరంగా ఉండాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఈసీ ఆదేశించడం టీఆరెఎస్ పార్టీకి కూడా ఇబ్బంది కరమనే చెప్పక తప్పుదు. సోమవారం రాత్రి 31 వరకూ మునుగోడులో జరిగే ప్రచారంలో రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసింది.

కీలకమైన రోజే…

అత్యంత కీలకమైన రోజునే మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడుకు దూరంగా ఉండాల్సి రావడం ఆయన వర్గానికి మింగుడు పడని అంశంగా మారింది. ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే పథకాలన్ని ఆగిపోతాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత కపిల్వాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఈసీ ఆదేశించడంతో… అలాంటి వ్యాఖ్యలు తాను ఎప్పుడూ చేయలేదని, కావాలనే వక్రీకరించారంటూ వివరణ ఇచ్చారు. అయితే మంత్రి ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందని ఈసీ జగదీశ్వర్ రెడ్డి 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆదివారం ఉప ఎన్నికల ప్రచారంలో మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మంత్రి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసీ నిర్ణయాన్ని కాదని ఆయన సీఎం సభకు హాజరయితే మరిన్ని కఠినమైన నిభందనలు విదించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో మంత్రి మునుగోడులో అడుగుపెట్టుకుండా అన అస్త్రాలను సంధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీడియా ముందు కూడా మాట్లాడవద్దని, సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం నిర్వహించరాదని కట్టడి చేసింది. దీంతో గుంట్లకండ్ల ప్రత్యక్ష్యంగా కనిపించకుండా… పరోక్షంగా వినిపించుకండా ఉండాల్సిందే.

అండర్ గ్రౌండ్ వర్కేనా…?

సాధారణంగా ఎన్నికల ప్రచారానికి తెర పడిన తరువాత పోలింగ్ కు ముందు రెండు రోజుల పాటు అన్ని పొలిటికల్ పార్టీలు మౌనంగా ఉండాలి. అయితే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి మాత్రం మరో రెండు రోజుల మందే ఈ పరిస్థితి తయారు కావడం అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారింది. పోలింగ్ కన్నా నాలుగు రోజుల ముందు నుండే జగదీశ్వర్ రెడ్డి అండర్ గ్రౌైండ్ వర్క్ చేసి సమీకరణాలు నెరపే పనిలో నిమగ్నం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన అనుచరులను పురమాయించడంతో పాటు నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఆయనకు తయారైంది.

You cannot copy content of this page