రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న నానుడి వినే ఉంటాం. అయితే రాజు ఎదుటి వాళ్లను హింసించాలని అనుకున్నప్పుడు తీవ్రంగా కొట్టాలని ఆదేశిస్తాడని ఈ సామెత అర్థం. అయితే ఇక్కడ మాత్రం ఓ రాజు గారు కాస్తా వైవిద్యంగా వ్యవహరించారు. ఆయన తలుచుకున్నది మాత్రం తననే శిక్షించుకోవాలని… ఇదేంటి రాజు ఇలా తలుచుకోవడం ఏంటీ తనను కొట్టాలని చెప్పడం ఏంటీ అనుకుంటున్నారా అయితే మీరీ వివరాలు చదివి తెలుసుకోవల్సిందే.
భూపేషా మజాకా…
చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూఫేష్ భగేల్ దీపావళి సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలోని దుర్గ్ గౌరీ గౌర ఆలయానికి వెల్లిన సీఎం చేతి దెబ్బలు కాదు ఏకంగా కొరడా దెబ్బలు తిన్నారు. దుర్గ్ ఆలయంలో కొరడా దెబ్బలు తింటే అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏటా దుర్గ్ కు వెల్లి కొరడాతో దెబ్బలు తినడం సీఎం భూపేష్ భగల్ కు ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు ఆయన అనచరులు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి తల్చుకుంటే ఎదుటి వాళ్ల భరతం పడ్తారని విన్నాం కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం తనకు తానే శిక్ష విధించుకున్నట్టుగా ఉందని అంటున్నారు మరి కొందరు.