అనూహ్య పరిణామాల చోటు చేసుకున్న మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారం ఏ పార్టీకి నష్టం వాటిల్లనుంది…? ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో జరిగిన ఈ ఆపరేషన్ లో బీజేపీ లక్ష్యంగా జరిగిన ఆరోపణలు… టీఆరెఎస్ పార్టీ చేసిన దాడుల ప్రతిఫలాన్ని గులాభి పార్టీ అందుకునే అవకాశం ఉందా..? ఆ పార్టీ ఎంత వరకు లాభ పడింది.? కమలం వికసించిందా.. లేదా అన్న విషయాలపై నిఘా వర్గాలు ఆరా తీయడం మొదలు పెట్టాయి. బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకూ చోటు చేసుకున్న ఈ పరిణామాలు… బీజేపీ నేతల కౌంటర్ అటాక్, నెట్టింట వైరల్ అవుతున్న అంశాలు తదితర విషయాలన్నింటిపై అర్జంట్ నివేదికలు ఉన్నతాధికారుల వద్దకు చేరుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని ఇంటలీజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. అయితే ఇందులో అధికార పార్టీకి ఎంతమేర సానుకూలత వచ్చింది, బీజేపీ ఎంత నష్టపోయింది అన్న వివరాలను కూడా తెలుసుకుని బేరీజు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో బాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ప్రాంతాల వారిగా, పార్టీ క్యాడర్ ల వారిగా, వివిధ వర్గాల ప్రజలకు సంబందించిన ఒపినియన్ సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా, సాధారణ మీడియా ప్రభావం కూడా ఎంత మేర ఉంది అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నాయిన ఇంటలీజెన్స్ వర్గాలు.
కొనుగోళ్లపై లేని క్లారిటీ..
అయితే నలుగురు టీఆరెఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రకటించినప్పటికీ డబ్బులు ఎంత రికవరీ చేశారు..? ఒక్కో ఎమ్మెల్యేకు ఎంత ధర ఇస్తామన్నారు..? ఎమ్మెల్యేలు డీల్ కు ఒప్పుకున్నారా లేదా..? ఫాం హౌజ్ లో దొరికిన డబ్బు ఎంత అన్న విషయాలపై మాత్రం స్పష్టత లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వంద కోట్ల డీల్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం ప్రలోభాలకు గురి చేస్తున్నరని ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు ఫాం హౌజ్ లో దాడులు చేశామని చెప్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఎంత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు..? నలుగురికి వంద కోట్లు ఇస్తామన్నారా..? లేక నలుగురికి వంద చొప్పున నాలుగు వందల కోట్లు ఇస్తామన్నారా అన్న విషయంపై పోలీసులు కానీ ఎమ్మెల్యేలు కాని క్లారిటీ ఇవ్వడం లేదన్న వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా ఫాంహౌజ్ లో నగదు దొరకిందని చెప్తున్న కారులో బ్యాగులకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడే లాజిక్ మిస్సయినట్టుగా కనిపిస్తోందని నెట్టింట కామెంట్ల హోరు సాగుతోంది. మునుగోడులో చల్మెడ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో రూ. కోటి పట్టుబడినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ వాహనంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు చొప్పరి వేణు ఉన్నాడని ప్రకటించారు. డబ్బుతో పాటు వేణును రెడ్ హైండెడ్ గా పట్టుకున్న వీడియోలు, ఫోటోలు విడుదల చేశారు. అయితే బుధవారం రాత్రి మొయినాబాద్ ఫాం హౌజ్ లో పట్టుబడ్డ నగదును ఎందుకు మీడియాకు చూపించలేదంటూ నెట్టింట ప్రశ్నల వర్షం స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఫాం హౌజ్ లో డబ్బు అయితే దొరికింది కానీ ఎంత సీజ్ చేశారు అన్న వివరాలు మాత్రం చెప్పడం లేదు. దీంతో బ్యాగుల్లో డబ్బులే లేవని అదంతా కట్టుకథ అంటూ మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఫాం హౌజ్ కూడా టీఆరెఎస్ పార్టీకి చెందిన పైలెట్ రోహిత్ రెడ్డిదేనని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. స్వామిజీలు డీల్ జరిపే విషయం రోహిత్ రెడ్డికి ముందే తెలుసా లేదా అన్న విషయం తేలాల్సి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక వేళ రోహిత్ రెడ్డి స్వామిజీతో చేతులు కలిపి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఫాం హౌజ్ కు పిలిపించుకున్నట్టయితే ఇందులో ఆయన పాత్ర కూడా ఉన్నట్టే కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ముందుగానే పైలెట్ డీల్ తో సంబంధాలు చేసుకున్నరా లేదా అనే విషయంపై కూడా స్పష్టత రావల్సిన అవసరం కూడా ఉంది.
సెల్ఫ్ డ్రైవింగ్…
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్యెల్యేలు నలుగురు కూడా గన్ మెన్లను, డ్రైవర్లను పక్కనపెట్టి ఫాం హౌజ్ కు వెల్లడం వెనక ఆంతర్యం ఏంటీ..? సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెల్లడం వెనక ఆంతర్యం ఏమైనా దాగి ఉందా..? లేక స్వామీజీ డీల్ విషయం తెలిసే వీరు సింగిల్ గా వెల్లారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎప్పుడూ వీఐపీల వెన్నంటి ఉండాల్సిన అంగరక్షకులు లేకుండా వెల్లిన విషయం గురించి డ్యూటీలో ఉన్న గన్ మెన్లు సంబంధిత అదికారులకు సమాచారం చేరవేశారా లేదా అనే విషయమూ పజిల్ గా మారింది. ప్రముఖులు గన్ మెన్లు లేకుండా వెల్లినట్టయితే వారిపై దాడి జరిగితే ముందుగా బలయ్యేది గన్ మెన్లే… వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదన్నది గతంలో జరిగన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య సమయంలో ఆయన వెంట లేడన్న కారణంగా గన్ మెన్ పై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు. తమకు గన్ మెన్లు అవసరం లేదని తిప్పి పంపిన ప్రముఖుల వెంటే గన్ మెన్లను పోలీసు అధికారులు పంపించిన సంఘటనలూ లేకపోలేదు. మునిసిపల్ ఎన్నికల సమయంలో పోలీసులకు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కి మధ్య జరిగిన మాటల యుద్దంలో ఆయన తన గన్ మెన్లను రిటర్న్ చేశారు. అయినప్పటికీ పోలీసు అధికారులు మాత్రం సంజయ్ ఇంటి వద్దే అంగరక్షకులను ఉంచి చివరకు సంజయ్ అంగరక్షకులను తీసుకునేందుకు సమ్మతించే వరకూ వదిలి పెట్టలేదు. ప్రముఖుల రక్షణ విషయంలో పోలీసు శాఖ తీసుకునే జాగ్రత్తలు ఈ విధంగా ఉంటే మొయినాబాద్ ఫాంహౌజ్ కు వెల్లిన ఎమ్మెల్యేల వెంట గన్ మెన్లను తీసుకెళ్లకపోవడం… ఈ విషయాన్ని గుట్టుగా ఉంచడం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నారు.
ప్రత్యక్ష్య సాక్ష్యం కంపల్సరీ…
అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గం ప్రత్యక్ష్య సాక్ష్యాన్ని బయటపెట్టడమేనన్న చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో జరిపిన స్టింగ్ ఆపరేషన్ కు సంబందించిన వీడియోలు లీక్ అయినట్టుగానే మొయినాబాద్ ఫాం హౌజ్ వ్యవహారంలో డీల్ గురించి జరిగిన ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంటే తప్ప విశ్వసనీయంగా తీసుకునే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నిఘా వర్గాలు ఇప్పటి వరకూ సేకరించి అభిప్రాయాలతో పాటు మరిన్ని కోణాల్లో కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల డైరక్షన్ తో మరింత లోతుగా కూడా ఫాం హౌజ్ డీల్ పై వివరాలు సేకరించనున్నట్టుగా సమాచారం.