అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం ఏంటి…?

ఫాంహౌజ్ ఎపిసోడ్ లో టీఆరెఎస్ సెల్ఫ్ గోల్ అయిందని బీజేపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే అస్త్రం సీఎం కేసీఆర్ అమ్ముల పొదిలో ఉందా.? ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన వ్యవహారంలో గులాభి బాస్ ఎలాంటి ఎత్తుగడ వేయబోతున్నారు..? మునుగోడు ఎన్నికల వేళ్లకు ఈ అస్త్రం విడుదల చేస్తారా లేదా ఇప్పడిదే టాపిక్ టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది.

ఎత్తగడల్లో స్పెషలిస్ట్…

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉన్న పాశుపతాస్త్రాన్ని చివరి నిమిషంలో సంధిస్తారని… ఖచ్చితంగా టీఆర్ఎస్ స్కెచ్ ఫలిస్తుందన్న నమ్మకంతో టీఆరెఎస్ వర్గాలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారన్న విశ్వాసంతో టీఆరెఎస్ శ్రేణులు ఉన్నాయి. ఇప్పటికే ఫాంహౌజ్ విషయంలో వైరల్ అవుతున్న అంశాల్లో ఏ ఒక్కటి కార్యరూపం దాల్చనప్పటికీ ఓ వర్గంలో మాత్రం కేసీఆర్ పై ఆశలు మాత్రం సజీవంగా ఉండడం గమనార్హం. బీజేపీ నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది టీఆరెఎస్ నాయకుల్లో మాత్రం ఏదో జరుగబోతుందని, అది పార్టీకి లాభం చేకూరుస్తుందని అంటున్నారు.

పుకార్ల షికార్లు…

బుధవారం రాత్రి నుండి నెట్టింట ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్కటి అమలు కాలేదు. మొదట ఈ ఆపరేషన్ అంతా కిషన్ రెడ్డి నెరిపారని ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయనే బేరసారాలు ఆడారని మొదట ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్ర మంత్రి సీరియస్ గా స్పందించడంతో ఆ ప్రచారం అంతా వట్టిదేనని తేలింది. గురువారం కొన్ని జిల్లాల్లో కిషన్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం… మరికొద్ది సేపట్లో పోలీసుల ప్రెస్ మీట్ లో ఆదారాలు వెల్లడించనన్నారని ప్రచారం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు డీల్ కుదిర్చారని వారి ఆడియోలు ఉన్నాయంటూ ట్రోల్స్ నడిచాయి. ఇవన్నింటి వివరాలు పోలీసులు, ముఖ్యమంత్రి గురువారం నాటి మీడియా సమావేశంలో వెల్లడిస్తారని కూడా ప్రచారం చేశారు. అయితే గురువారం సైబరాబాద్ పోలీసులు కానీ, సీఎం కేసీఆర్ కానీ ఎలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతేకాకుండా కేంద్ర మంత్రి అమిత్ షాతో స్వామి రామచంద్ర భారతి, సింహ యాజులు, నంద కుమార్ లు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన టచ్ లోకి రాలేదని… ఆయన పర్సనల్ సెక్రటరీతో మాట్లాడిన ఆడియో గంటన్నరకు పైగా ఉందని దానిని కోర్టుకు అందజేస్తారని కూడా ప్రచారం జరిగింది. గురువారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరు పర్చినప్పుడు అసలు ఆధారాలే లేవని ఈ సెక్షన్లే వర్తించవంటూ జడ్జి వ్యాఖ్యానించి రిమాండ్ రిపోర్టునే తిరస్కరించారు. దీంతో ఫాం హౌజ్ ఎపిసోడ్ లో పోలీసులకు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కానట్టు స్పష్టం అయిపోయినప్పటికీ ఇంకా ఏదో సాక్ష్యం ఉందంటూ మరో ప్రచారం స్టార్ట్ అయింది. దీనిని రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తారన్న నమ్మకంతో టీఆరెఎస్ పార్టీ నాయకులు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన అపవాదును తొలగించుకునేందుకు కోర్టులో సమర్పించే వారు కదా అన్న చర్చకూడా సాగుతోంది. మరోవైపున గురువారం మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్ ను కూడా వీరు ఊటంకిస్తూ తమ అనుమానం నిజమే అయి ఉంటుందన్న భరోసా కూడా వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల వరకు ఈ ఆధారం ఏంటో తేటతెల్లం అవుతుందో లేదో వేచి చూడాలి మరి…

You cannot copy content of this page