కేంద్రం అక్కడ… కార్యాకలాపాలు ఇక్కడ…

మునుగోడులో విచిత్రం…

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆ నియోజకవర్గానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా… అందరినోట పలుకుతున్న ఆ సెంటర్ పేరుకు… కార్యకలాపాలు జరుగుతున్న చోటకు సంబంధం లేదని మీకు తెలుసా… ఇంతకీ ఏమా సెగ్మెంట్… ఏంటా కథ అంటే మీరీ స్టోరీ చదవాల్సిందే… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి అనూహ్య రాజకీయా పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలు జరుగుతున్న మునుగోడు నియోజకవర్గం గురించి తెలుకునే ప్రయత్నం చేద్దాం. అధికారికంగా నియోజకవర్గం కేంద్రం మునుగోడే అయినప్పటికీ అక్కడ మాత్రం అధికారిక కార్యక్రమాలు జరగవు. ఎన్నికల కమిషన్, అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం మనుగోడు పేరు వినిపిస్తున్నప్పటికీ హెడ్ క్వార్టర్ మాత్రం వేరే చోటనే అని చెప్పాలి. మొత్తం ఏడు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గ కేంద్రం మాత్రం చండూరే. చండూరు కేంద్రంగానే అధికారులు నియోజకవర్గ కార్యకలాపాలను చక్కబెడుతుంటారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రకియే అయినా, పోలింగ్ కు సంబంధించిన వ్యవహారాలే అయినా అన్ని కూడా చండూరు నుండే నిర్వహిస్తుంటారు. నియోజకవర్గ కేంద్రం ఓ చోట ఉంటే కార్యకలాపాలు వేరే చోట నుండి జరిగే నియోజకవర్గాలు చాలా అరుదనే చెప్పాలి. డిలిమిటేషన్ కు ముందు కొన్ని నియోజకవర్గాలు ఈ విధంగా ఉండేవి. కానీ ఇప్పటికీ మునుగోడు మాత్రం అలాగే ఉండడం గమనార్హం.

You cannot copy content of this page