పచ్చతోరణమా గులాబీ మయమా..?

అవకాశం కోసం ఓ పార్టీ ఎదురుచూసి ఎంట్రీ ఇస్తుంటే.. ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అధికార పార్టీ చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని టిడిపి ఉవ్విళ్లూలరుతోంది. అయితే ఆ జిల్లాలో పూర్తిస్థాయి పట్టు సాధిస్తే అన్ని విధాల లాబిస్తుందని అధికార టీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. దీంతో ఇరు పార్టీల ఎత్తులకు పైఎత్తులకు వేదికగా మారనుంది ఆ జిల్లా.

ఖమ్మం కేంద్రంగా..

ఖమ్మం జిల్లాలో తెలంగాణ ప్రభావం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్థిరపడ్డవారే కావచ్చు పూర్వకాలం నుంచి ఇక్కడ ఉంటున్న వారే కావచ్చు వారి బంధాలు అనుబంధాలు ఎక్కువగా పక్కనే ఉన్న ఏపీ సరిహద్దు జిల్లాల తోనే ఉంటాయి. అయితే రానున్న ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీని మట్టికరిపించాలన్న లక్ష్యంతో టిడిపి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. త్వరలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖమ్మం జిల్లా పర్యటన ఫిక్స్ కావడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిడిపికి మొదటి నుండి కూడా పట్టు ఉందని చెప్పక తప్పదు ఇక్కడ మెజార్టీ స్థానాలను గతంలో గెలుచుకున్న చరిత్ర టిడిపిది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అయినా స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాతే అయినా టిడిపి ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం టిడిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి పట్టు సడలి పోలేదన్నది వాస్తవం. ఇప్పుడు ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఖమ్మంలో పార్టీ పట్టును నిరూపించుకోవాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.

రివైంజ్ కోసం

తెలంగాణలో గత వైభవాన్ని సంతరించుకోవాలన్నా లక్ష్యం కన్నా చంద్రబాబు నాయుడుకు టిఆర్ఎస్ పార్టీని మట్టి కల్పించాలన్న సంకల్ప బలమే ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ళగత ఎన్నికల నుండి ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకొని అక్కడి సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాలకే పరిమితమైతే చంద్రబాబు పట్టించుకునే వారు కాదని ఆ రాష్ట్రంలో కూడా కేసీఆర్ స్కెచ్ వేస్తుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రతీకారం తీర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చి గులాబి బాస్ కు చెక్ పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు ఇందుకు అనుగుణంగానే పావులు కదపడం ఆరంభించారు. ముందుగా ఖమ్మం నుండి రీఎంట్రీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేస్తే తన బలం బలగం తెలంగాణ ప్రజలకు చేతల్లో చూపించి పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు అవకాశం గా మార్చుకోవచ్చని చూస్తున్నారు. ఏది ఏమైనా టిడిపి తన ఎత్తులతో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.

You cannot copy content of this page