14 మంది సజీవదహనం
ఇండోనేసియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఓడలో మంటలు చెలరేగడంతో 14 మంది సజీవదహనమయ్యారు. సముద్రంలో చిక్కుకున్న మరో 226 మందిని రెస్క్యూ టీం కాపాడింది. ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్‌లో కుంపాంగ్ నుంచి కలాబాహి వెళ్తున్న ఓడలో ఈ ప్రమాదం జరిగగా 230 మంది అందులో ప్రయాణిస్తున్నారు. 10 మంది సిబ్బంది కలిపి మొత్తం 240 మంది ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే మంటలు ఎందుకు చెలరేగాయనే విషయంపై ఇంకా స్ఫష్టత రాలేదని ఘటనపై విచారణ చేపట్టామని అధికారులు ప్రకటించారు. 17 వేల ఐలాండ్స్‌కు నిలయమైన ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణంగా మారడం ఆందోళన కల్గిస్తోంది. భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా తరుచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2018లో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓడ మునిగిపోయిన ఘటనలో 167 మంది జలసమాధి కావడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. 1991లోనూ జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగిన ఘటనలో 332 మంది మృత్యువాత పడగా 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post