కీకారణ్యంలో కాల్పుల మోత… పదమూడుకు చేరిన మృతుల సంఖ్య..?

కోర్చోలి ఎన్ కౌంటర్ ఘటన

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా కోర్చోలి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఎదురు కాల్పుల ఘటనలో మొదట నలుగురు నక్సల్స్ మరణించారని మద్యాహ్నానికల్లా ఈ సంఖ్య 9కి పెరగగా, సాయంత్రం మరోకరి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. బుధవారం వేకువ జామున అందిన సమాచారం మేరకు ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 13 మంది మావోయిస్టలు మృతదేహాలను గుర్తించారు. చత్తీస్ గడ్ పోలీసులు వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు… బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య దాదాపు 8 గంటల పాటు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం కొర్చోలి అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత కోసం బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మొత్తం 13 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు గుర్తించడంతో పాటు ఆధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

You cannot copy content of this page