దిశ దశ, జాతీయం
కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు, అడ్వకేట్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు మరణ శిక్ష విధిస్తూ మాలవికర ఫస్ట్ అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… 2021 డిసెంబర్ 19న రంజిత్ శ్రీనివాసన్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వా పరాలను పరిశీలించిన మాలవికర జిల్లా అదనపు కోర్టు నిందితులు 15 మందికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మంగళవారం ఇచ్చిన ఇచ్చిన ఈ జడ్జిమెంట్ సంచలనంగా మారింది. ఇప్పటికే పీఎఫ్ఐపై నిషేధంలో అమల్లోగా ఉండగా ఈ సంస్థ అనుభందంగా ఓ రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు అయింది.
