బ్యాలెట్ కౌంటింగ్ ను మరిపించిన ప్రక్రియ

ధర్మపురి కౌంటింగ్ రికార్డుల సేకరణ

17 గంటలు సాగిన ఉత్కంఠ

దిశ దశ, జగిత్యాల:

సుదీర్ఘంగా కొనసాగిన ధర్మపురి కౌంటింగ్ రికార్డుల సేకరణ కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. సుమారు 17 గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియ ముగిసిన తరువాత యథావిధిగా స్ట్రాంగ్ రూంకు సీజ్ చేసిన అధికారులు రికార్డులను సీల్డ్ కవర్లలో భద్రపర్చి హై కోర్టుకు అందించనున్నారు.

ఆదివారం ఉదయం ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్దకు వెలుతున్న అధికారి

కౌంటింగ్ ను మరిపించిన వైనం…

బ్యాలెట్ పేపర్ల విధానానికి స్వస్తి పలికి ఈవీఎంల ద్వారా ఎన్నికలు కొనసాగిస్తున్న తరువాత కౌంటింగ్ చేయడం యంత్రాంగానికి సులువుగా మారింది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరిగినప్పుడు కౌంటింగ్ ముగియాలంటే కొన్ని నియోజకవర్గాల్లో 24 గంటల సమయం కూడా పట్టేది. అయితే ఈవీఎంల ద్వారా పోలింగ్ విధానం చేపట్టినప్పటి నుండి 8 గంటల్లోగానే ఫలితాలను వెల్లడిస్తున్న సందర్భాలే ఎక్కువ. రీ కౌంటింగ్ వంటి అంశాలు, లెక్కలు సరి చూసుకోవడాలు వంటివి ఎదురయినప్పుడు అదనంగా మరో రెండు నండి మూడు గంటల సమయం పట్టేది. కానీ ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూంలో 17ఎ, 17సి, 17 సి పార్ట్ 2 ఫామ్స్ ఫోటో స్టడ్ కాపీలు తీసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగానికి 17 గంటల సమయం పట్టడం గమనార్హం. ఆదివారం ఉదయం 11 గంటలకు నూకపల్లి వీఆర్కె కాలేజీ లోపలకు వెల్లిన అధికారుల బృందం 11.15 నిమిషాలకు స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టారు. సోమవారం తెల్లవారు జామున 3.50 నిమిషాలకు హై కోర్టు ఆదేశాలతో రికార్డుల నఖల్లను సేకరించి బయటకు వచ్చారు. ఈ ప్రక్రియను అంతా పరిశీలించేందుకు ఈసీఐ ప్రిన్సిపల్ సెక్రటకరీ అవినాష్ కుమార్ అబ్జర్వర్ గా వ్యవహరించగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, అడిషనల్ కలెక్టర్ లతలు పర్యవేక్షించారు. అన్ని స్థాయిలు అధికార యంత్రాంగం కలిపి దాదాపు 150 మంది ఈ ప్రక్రియలో పనిచేయాల్సి వచ్చింది. 10 టేబుళ్లు, స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో టేబుల్ కు 8 నుండి 10 మంది విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.

సోమవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో స్ట్రాంగ్ రూం నుండి బయటకు వస్తున్న అధికారుల వాహనాలు

మిస్టరీల పరంపర

అయితే ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం వ్యవహారంలో చివరి వరకు మిస్సింగ్ తో పాటు ఇతరాత్రా అనుమానాలతోనే కొనసాగడం గమనార్హం. స్ట్రాంగ్ రూం తాళం చెవులు అదృశ్యం అయిన ఘటనే సంచలనంగా మారితే, హై కోర్టు ఆదేశాలతో లాక్స్ బ్రేక్ చేసిన తరువాత లోపల ఉన్న పరిస్థితి మరీ దారుణంగా ఉందని అభర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలు, 17ఏ, 17సి, 17సి పార్ట్ 2తో పాటు ఇతరాత్ర డాక్యూమెంట్లను భద్రపర్చిన ట్రంకు బాక్సుల్లో కొన్నింటికి తాళలే లేకపోగా, కొన్ని పెట్టెలకు తాళం వేసినా కీస్ లభ్యం కాకపోవడం విస్మయం కల్గిచింది. అలాగే క్రమ పద్దతితో రికార్డులను కానీ, ఈవీఎం బాక్సులను కానీ స్ట్రాంగ్ రూంలో ఉంచకపోవడంతో వాటిని వెతకడానికి అధికార యంత్రాంగానికి చుక్కలు కనిపించాయి. గంటల పాటు ట్రంకు పెట్టెలను వెతికితే తప్ప అన్ని రికార్డులు సకాలంలో లభ్యం కాలేదని తెలుస్తోంది. 36వ బూతుకు సంబంధించిన రికార్డు మొదట దొరకకపోవడంతో ఒకింత ఉత్కంఠత నెలకొనగా చివరకు ఈ బాక్సు ఆచూకి లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని తెలిసింది. 209 బూత్ కు సంబంధించిన 17సి ఫామ్స్ స్టోర్ చేసిన కవర్ కు సీల్ లేకుండా ఉందని కూడా తెలుస్తోంది. కౌంటింగ్ హాల్ సీసీ ఫుటేజీ, ఈవీఎంల తరలింపు సమయంలో తీసిన వీడియో ఫుటేజీ, స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిని సీసీ కెమెరాల ఫుటేజీ ఏవీ కూడా అందుబాటులో లేవని అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం. స్ట్రాంగ్ రూం కీస్ ధర్మపురి ఆర్వో కార్యాలయంలో ఉండడం నుండి మొదలు చివరకు 17సీ ఫామ్స్ భద్రపర్చిన తీరు వరకు చాలా అంశాల్లో అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page