దశాబ్దాల ‘చెర’కు విముక్తి…

దిశ దశ, హైదరాబాద్:

వివిధ కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తున్న వారికి విముక్తి కల్గింది. విముక్తితో పాటు ఉపాధి కల్పించేందుకు జైళ్ల శాఖ చొరవ తీసుకుంది. బుధవారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో జైలు జీవితం గడుపుతున్న 213 మందికి స్వేచ్ఛ కల్పించారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. రాష్ట్రంలోని వివిధ జైళ్లలో  10 నుండి 24 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వారికి స్వేచ్ఛా వాయువులు కల్పించారు జైళ్ల శాఖ అధికారులు. అయితే వీరిలో చాలా మందికి కూడా జైళ్ల శాఖ ఆద్వర్యంలోనే ఉపాధి కల్పించేందుకు తెలంగాణ జైల్స్ వింగ్ అధికారులు చొరవ తీసుకోవడం మరో విశేషం. సత్ప్రవర్తన కలిగిన వీరంతా కూడా తమ కుటుంబాలతో కలసి జీవనం సాగించే అవకాశం చిక్కినందున నేర మయ ప్రపంచానికి దూరంగా జీవించాలని అధికారులు ఆకాంక్షించారు. 

You cannot copy content of this page