ఒకే రోజు 35 డెలివరీలు

సర్కారు ఆసుపత్రుల్లో సంస్కరణలు తీసుకరావడమే కాదు ప్రభుత్వ వైద్య యంత్రాంగంలో కూడా సేవా దృక్పథం పెరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ డబ్బులు వృధా చేసుకోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తన్నీరు హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న తరువాత నూతన ఒరవడితో ప్రభుత్వ వైద్యం ముందుకు సాగుతోంది. పరిపాలనలో తన మార్కు ఉంచడంలో తనకు తానే సాటి అయిన తన్నీరు హరీష్ రావు ప్రభుత్వ వైద్య శాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించే దిశగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్పూర్తితో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు కూడా తమ వైద్య వృత్తిపై తమ నిబద్దతను ప్రదర్శిస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒకే రోజు 35 డెలివరీలు చేయడమే ఇందుకు ఉదాహారణగా చెప్పవచ్చు. ఓ వైపున కేసీఆర్ కిట్స్ వంటివి అందించడంతో సర్కారు దవాఖానాల్లో సకల సదూపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మంగళవారం జనగామ ప్రభుత్వ ఆసుపత్రులు 35 మంది తల్లులు పండంటి బిడ్డలకు జన్మివ్వడం అత్యంత అరుదేనని చెప్పాలి.

వెల్ డన్…

జనగామ ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం పనితీరును మంత్రి హరీష్ రావు మెచ్చుకున్నారు. ఒకే రోజు 35 డెలివరీలు చేసి రాష్ట్రంలో అరుదైన ఘనతను సాధించారన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ టీమ్స్ పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్కారు వైద్యం విముఖత చూపే పరిస్థితిలో మార్పు వస్తోందంటే రాష్ట్రంలో వైద్య సేవల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

You cannot copy content of this page