మహేష్ కోసం 4 భారీ సెట్లు నిర్మిస్తున్నారట !

ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటే లోకేషన్స్ కోసమే నెలల తరబడి వెతికే వాళ్ళు. కాని ఇప్పుడు ఆ బాధలు తప్పుతున్నాయి. దానికి కారణం బారీగా నిర్మిస్తున్న సెట్లు. ఒక్కొక్క సినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసి సెట్లు నిర్మిస్తున్నారు
మేకర్స్. అందులో సగానికి పైగా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్లో ట్రేండింగ్ ఐపోయింది. మరి సెట్స్ కే పరిమితమై ఆ సినిమాలు ఏంటి, స్క్రిప్టు డిమాండ్ చేస్తే సెట్లు వేయడం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నడుస్తున్న ఆనవాయితీ. ఒక్కడు, అర్జున్ లాంటి సినిమాలో అదిరిపోయే సెట్లు వేశారు మన వాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అందులో కథకు తగ్గట్టు ఇంకా అదిరిపోయే సెట్లు వేయడంమే కాదు షూటింగ్ కుడా అక్కడే ఎక్కువ భాగం తీస్తున్నరు. రంగస్థలం లాంటి సినిమాలో దాదాపు 60 % ఒక్క సెట్ లోనే తీశారు.

ఈ మధ్య కాలంలో లోకేషన్స్ కంటే ఎక్కువగా సెట్స్ లోనే కాలం గడిపేస్తున్నరు మన హీరోలు.
ఆ మధ్య అచార్య కోసం కొకాపేటలో 28 ఎకరాల్లో దాదాపు 20 కోట్లతో ధర్మస్థలి టెంపుల్ సెట్ వేశారు. ఆచార్య సినిమా సగానికి పైగా షూటింగ్ అక్కడే చేశారు. తాజాగా ఎన్టిఆర్ 30 కోసం శంషాబాద్ లోని ఒక స్టూడియోలో భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ లోనూ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 4 భారీ సెట్ల నిర్మిస్తున్నారు. దాని కోసం నిర్మాతలు 12 కోట్లు ఖర్చు చేశారు. షూటింగ్ చాలా భాగం ఈ సెట్స్ లోనే జరగబోతుంది. ఇప్పటికే మొదటి భాగం పూర్తి చేసుకున్న ఈ చిత్రం , రెండవ షెడ్యూల్ మొదలుకానుంది. గతంలో భరత్ అనే నేనులో అసెంబ్లీ సెట్ , సర్కారి వారి పాటలో బ్యాంక్ సెట్ హైలెట్ గా నిలిచాయి. ఆచార్య,రంగస్థలం,జనతా గ్యారెజ్ లాంటి సినిమాలు ఎక్కువ భాగం సెట్స్ లోనే జరిగాయి. మరోవైపు రాజమౌళి బాహుబలి, RRR సినిమా కోసం భారీ సెట్లు నిర్మించారు. రాధే శ్యామ్ కోసం ఏకంగా ఇటలీ సెట్ నే హైదరాబాద్లో వేశారు.. మొత్తానికి ఈ మధ్య బయట లోకేషన్స్ కంటే సెట్ల లోనే కాలం గడిపేస్తున్నరు మన హీరోలు.

You cannot copy content of this page