నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 40 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. తాజాగా 40,889 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ను చూసి పోస్టులను భర్తీ చేస్తారు. 40 వేలకుపైగా ఉన్న పోస్టుల్లో ఏపీలో 2480 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 1266 పోస్టులు ఉన్నాయి.

జనవరి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.., ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు మార్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే కంప్యూటర్ పై టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు సైకిత్ తొక్కడం వచ్చి ఉండాలి. పదో తరగతితో మ్యాథ్స్, ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాష తప్పనిసరిగా చదవి ఉండాలి.

ఏపీ, తెలంగాణ అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి వరకు తెలుగు భాష సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఈ పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీపీఎం ఉద్యోగాలకు జీతం రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు ఉంటుంది. ఇక ఏబీపీఎం, డావ్ సేవక్ కు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు.

మొత్తం 40,889 పోస్టుల్లో యూపీలో 7899 పోస్టులు ఉండగా.. తమిళనాడులో 3167 పోస్టులు, కర్ణాటకలో 3036 పోస్టులు ఉన్నాయి. కేరళలో 2462 పోస్టులు ఉన్నాయి. భారీగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుంది.

You cannot copy content of this page