44 జీఓను అమలు చేయండి…

గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులను ఆదుకోండి

జీఓ 44 ప్రకారం గౌరవెల్లి ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని వారికి అవసరమైన పరిహారం కూడా అందించాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 185 మందికి పునరావసం ప్యాకేజీ కింద నివేశన స్థలాలు, ఇంటి నిర్మాణం కోసం డబ్బులతో పాటు ఇతరాత్ర బెనిఫిట్స్ చెల్లించాలని స్పష్టం చేసింది. బాధితుల తరుపున అడ్వకేట్ ఎన్నంపల్లి గంగాధర్ వేసిన పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సేవానాయక్ తండా, బోంద్యా నాయక్ తండా, జల్ బాయి తండా, చింతల్ తండా, తిరుమల్ తండాలకు సంబంధించిన 185 మంది బాధితులకు పరిహారం కింద రూ. 7.50 లక్షలు, ఇంటి నిర్మాణం కోసం 242 గజాల స్థలం రూ. 5.04 లక్షల నగదు ఇవ్వాలని, ప్రతి మేజర్ అయిన బాధితునికి డబుల్ ఇళ్లు లేదా ఆర్ అండ్ ఆర్ కింద 242 గజాల ఇంటి స్థలం రూ. 5లక్షల నగదు చెల్లించాల్సిందేనని హై కోర్టు తీర్పు ఇచ్చింది. అక్కనపేట మండలం రామవరం గ్రామంలో 26.28 ఎకరాల స్థలంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అభివృద్ది చేస్తున్నందున వీరికి కూడా రామవరంలోనే సమకూర్చాలని కోర్టు నిర్దేశించింది.

You cannot copy content of this page