ఆవు పొత్తి కడుపులో 50 కిలోల ప్లాస్టిక్…

సవాల్ విసురుతున్న ప్లాస్టిక్

దిశ దశ, కరీంనగర్:

ఆవు పొత్తి కడుపు నుండి ఏకంగా 50 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తీశారు డాక్టర్లు. కరీంనగర్ పశు వైద్యశాల డాక్టర్స్ టీమ్ బుధవారం సర్జరీ చేసి ఆవు పొత్తి కడుపు నుండి ప్లాస్లిక్ వ్యర్థాలను బయటకు తీశారు. రోజు ఒక ఆవు 25 కిలోల వరకు మేత తింటుందని, సరైన పశుగ్రాసం దొరకకపోవడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మింగుతుండడంతో అవి వాటి ప్రాణాలను తీసుకుంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. కరీంనగర్ వెటర్నరీ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

ఎలా వెల్తోంది..?

ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా పశువుల ప్రాణాలకు సవాల్ విసురుతున్నాయి. క్యారీ బ్యాగ్స్ వాడకం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వేస్టేజీ కూడా ప్లాస్టిక్ కవర్లలో వేసి పడేస్తుండడంతో ఆహారం కోసం తిరిగే ఆవులు కవర్లతో సహా మింగేస్తున్నాయి. అలాగే చాలా మంది మిగిలిపోయిన ఆహారాన్ని కూడా కవర్లలో వేసి పడేస్తుండడంతో ఆహరం వాసన పసిగట్టే పశువులు వాటిలోని ఆహారం కోసం కవర్లతో సహా నమిలి మింగుతున్నాయి. కవర్లని పశువుల పొట్టలో నిలువ ఉండి వాటిని బలితీసుకుంటున్నాయి. ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బజార్లలో ప్లాస్టిక్ కవర్లు పడేస్తుండడం వల్ల పశువులు వాటిని మింగుతూ ప్రాణాలు తీసుకుంటున్నాయి. వాస్తవంగా ప్లాస్టిక్ అనేదే అత్యంత కాలుష్య కారకాల్లో ఒకటి. ఇవి భూమి లోపలకు వెల్లిన తరువాత వందేళ్లు అయినా కూడా అస్థిత్వాన్ని కోల్పోకుండా ఉంటాయంటే ప్లాస్టిక్ ఎంత డేంజర్ అన్న విషయం గుర్తించాలి. కేవలం పశువులకే కాదు మానవాళి మనుగడుకు కూడా పెను సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేసుకోనట్టయితే మరిన్ని అనర్థాలు ఎదుర్కొవలసిన ప్రమాదం లేకపోలేదు

You cannot copy content of this page