బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యూలర్ ప్రాతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 500 ఉద్యోగాల్లో జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్ లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు 350 ఉండగా.. ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ పోస్టులు 150 ఉన్నాయి.

ఇక అర్హతల విషయానికొస్తే.. క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక ఐటీ ఆఫీసర్ పోస్టులు బీఈ, బీటెక్, పీజీ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్-టెలికమ్యూనికేషన్స్,. ఇన్పర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ లలో బీఈ, బీటెక్, పీజీ చేసి ఉండాలి. వయస్సు ఫిబ్రవరి 2 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.

వయో పరిమితి విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు కల్పించారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.36 వేల నుంచి రూ.64,480 వరకు జీతం ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ పోస్టులకు రాతపరీక్ష నిర్వహిస్తరు. రాతపరీక్షలో పాస్ అయిన వారికి బృంద చర్చలు, ఇంటర్వూ ఉంటాయి. పరీక్ష విషయానికొస్తే.. మొత్తం 225 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఎకానమీ, డేలా అనాలసిస్, లెటర్ రైటింగ్, ఎస్సైల అంశాల గురించి ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వగా.. దరఖాస్తులకు చివరితేదీ 25. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

You cannot copy content of this page