నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. ఖాళీగా ఉన్న 500 ప్రొబేషనరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యూలర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 500 ప్రొబిబేషనరీ పోస్టుల్లో జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు 350 ఉండగా.. ఐటీ ఆఫీసర్ ఇన్‌స్పెషలిస్ట్ స్ట్రీమ్ పోస్టులు 150 ఉన్నాయి. క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చదివినవారు అర్హులు.
ఇక ఐటీ ఆఫీసర్ పోస్టులకు బీఈ, బీటెక్, పీజీ చేసినవారు అర్హులు. పీజీలో కంప్యూటర్ సైన్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్టుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయస్సు ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. వయో పరిమితిలో సడలింపు విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36 వేల నుంచి రూ.63 వేల వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ.850 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఉంటుంది. రాత పరీక్ష విషయానికొస్తే.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 35 ప్రశ్నలు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ లో 35 ప్రశ్నలు, ఇంగ్లీస్ డిస్కిస్ట్రివ్ పేపర్-లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే 25 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 45 ప్రశ్నలు, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్ నెస్ 40 ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 175 ప్రశ్నలకు 225 మార్కులు ఉంటాయి.