దండకారణ్యంలో మరణ మృదంగం 106 రోజులు 71 మంది…

దిశ దశ, దండకారణ్యం

ఈ ఏఢాది చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మరణ మృదంగం సాగుతోంది. మావోయిస్టులు, బలగాలకు మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్దంలో సాయుధ నక్సల్స్ ప్రాణాలు వదలుతున్నారు.  అభూజామడ్ లో మావోయిస్టులు పాగా వేసినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పోరాటంలో ఇంత పెద్దమొత్తంలో మావోయిస్టులను కోల్పోయిన సంఘటనలే లేవు. బస్తర్ అటవీ ప్రాంతంలో అణువు అణువుపై పట్టున్న మావోయిస్టులే ఎప్పుడై పై చేయిగా నిలిస్తే ఈ ఏడాది మాత్రం బలగాల ఎధురుదాడి పెరిగిపోయింది. దీంతో 106 రోజుల్లో 71 మంది మావోయిస్టులు వివిధ ఎన్ కౌంటర్లలో చనిపోయారు. జనతన్ సర్కార్ ఏరియాపై పట్టు సాధించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్యాంపులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతపై స్పెషల్ ఆఫరేషన్లకు శ్రీకారం చుట్టింది. కగార్ పేరిట తమ కార్యకలాపాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ కూడా పలుమార్లు ఆరోపించింది. ఓ వైపున చర్చల అంశం తెరపైకి వచ్చినా మరో వైపున మాత్రం ఎన్ కౌంటర్ ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. పూర్వ బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లలో మంగళవారం నాటి ఎధురు కాల్పుల ఘటనే అతి పెద్దది ఈ ఘటనలో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా ఇటీవల కోర్చోలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది పీఎల్జీఏ టీమ్ ను బలగాలు మట్టుబెట్టాయి.
ఆయా ఘటనల్లో 2 ఎల్ఎంజీలు, మూడు ఏకె 47లు, ఒక ఎస్ఎల్ ఆర్, రెండు ఇన్సాస్, 4 303 తుపాకులు, 3 9ఎంఎం పిస్తోళ్లతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలు, తూటాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు బస్తర్ రేంజ్ పోలీసులు.

తాజా ఎన్ కౌంటర్ మృతులు వీరే…

మంగళవారం కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో మొత్తం 29 మంది మరణించగా 9 మందిని గుర్తించారు. వీరిలో డీవీసీఎం, నార్త్ బస్తర్ డివిజన్ మాస్ ఇంఛార్జి శంకర్, డీవీసీఎం, ప్రతాప్ పూర్ ఏరియా కమిటీ ఇంఛార్జి, జనతన్ సర్కార్ కో ఆర్డినేటర్, ఇంఛార్జి లలిత, నార్త్ బస్తర్ డివిజన్ కు చెందిన మాధవి, ప్రతాప్ పూర్ ఏరియా కమిటీకి చెందిన జుగ్ని అలియాస్ మాల్తి, శుక్లాల్, ఫ్రాంగ్ ఎల్ఓఎస్ కమాండర్ రూపి, నార్త్ బస్తర్ డివిజన్ కమిటికి చెందిన రామశిల, రంజితలను గుర్తించారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 15 మంది మహిళా నక్సల్స్, 14 మంది పురుషులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించారు.

You cannot copy content of this page