నౌక తెచ్చిన తంటా.. ఆస్ట్రేలియా అధికారుల అలెర్ట్

ప్రయాణీకులను చేరవేసే నౌక ఇప్పుడు ఆదేశ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రమాదానికి గురయ్యే కమ్యూనికేషన్ కట్ అయ్యో ఈ నౌక అధికారులను ఇబ్బంది పెట్టడం లేదు. ఆ నౌకలో ట్రావెల్ చేస్తున్న వారికి సోకిన వ్యాధే వారిని అలెర్ట్ చేసింది. ఇంతకీ ఏజరిగిందని అనుకుంటున్నారా..? న్యూజిలాండ్ నుండి సిడ్నీ బయలు దేరిన ఓ నౌకలో ప్రయాణిస్తున్న 800 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఓ క్రూయిజ్ షిప్ లో పెద్ద ఎత్తున కరోనా బారిన పడడం ఆస్ట్రేలియా అధికారులను కలవరానికి గురి చేస్తోంది. న్యూజిలాండ్ నుండి ఆస్ట్రేలియా వెల్తున్న మెజిస్టిక్ ప్రిన్సెన్ క్రూయిజ్ నౌకలో ఉన్న ప్రయాణీకులు ఈ వ్యాధి బారిన పడ్డారని గుర్తించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ షిప్ ను సిడ్నీ సమీపంలో నిలిపివేసిన అధికారులు బాధితుల్లో కొందరికి టైర్ 3 దశకు వ్యాది చేరుకుందని ఇది ప్రమాదకరమని అంటున్నారు. కరోనా ప్రోటోకాల్ అమలు చేస్తున్నామని, లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ కు తరలించామని షిప్ కంపెనీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీరిలో కొంతమందికి కోవిడ్ లక్షణాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుండగా, గతంలో న్యూ సౌత్ వేల్స్ రుబీ ప్రిన్సెస్ నౌకలో 914 టూరిస్ట్ లు వైరస్ బారిన పడగా 28 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ ప్రారంభ దశలో జరిగిన రూబీ ప్రిన్సెస్ నౌక ఘటనతో క్రూయిజ్ షిప్ ఘటనను పోల్చుతున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న కార్నివాల్ కోసం న్యూజిలాండ్ నుండి ఈ నౌక బయలుదేరినట్టుగా చెప్తున్నారు.

You cannot copy content of this page