అధికారికంగా నిజాం నవాబు అంత్యక్రియలు

17న హైదరాబాద్ కు పార్థివ దేహం

ఎనిమిదవ నిజాం నవాబ్ మృత్యువాత పడ్డారు. టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి 1.30 గంటలకు మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ స్టేట్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీఖాన్ ముకర్రం జా ఇస్తాంబుల్ లో చనిపోయినట్టు ఆయన కార్యాలయం వెల్లడించింది. 1933లో జన్మించిన ఆయన కొంత కాలం క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి ఇస్తాంబుల్ లో స్థిరపడ్డారు. నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్ధిఖీ ముకర్రం జా, అసఫ్ జా VIII, ముకర్రం జాగా గుర్తింపు పొందిన ఆయన హైదరాబాద్ స్టేట్ చివరగా పాలించిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు అజం జాకు జన్మించాడు. ఆయన తల్లి టర్కీ చివరి సుల్తాన్ (ఒట్టోమన్ సామ్రాజ్యం) సుల్తాన్ అబ్దుల్ మెజిద్ II కుమార్తె యువరాణి దురు షెహ్వార్. హైదరాబాద్ ఎనిమిదో నిజాం ఇంగ్లాండ్‌లోని హారో, పీటర్‌హౌస్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో చదువుకున్నారు. 14 జూన్ 1954న, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇతన్ని వారసుడిగా ప్రకటించారు. అతని వారసత్వాన్ని భారత ప్రభుత్వం సూత్రప్రాయంగా గుర్తించినప్పటికి 1971 వరకు ఇండియన్ యూనియన్ లోని సంస్థానాలను రద్దు చేసే వరకు కూడా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. తన తండ్రిలాగే, ముకర్రామ్ కూడా 1980 వరకు భారతదేశంలో అత్యంత ధనవంతుడు. హైదరాబాద్‌లో ఆయనకు ఫలక్‌నుమా ప్యాలెస్, ఖిల్వత్ ప్యాలెస్, కింగ్ కోటి, చిరాన్ ప్యాలెస్ వంటి ఆస్తులు ఉన్నాయి.

17న హైదరాబాద్ కు…

ఎనిమిదో నిజాం నావాబ్ పార్థివ దేహాన్ని ఈ నెల 17న హైదరాబాద్ కు తరలించనున్నారు. ఆయన కోరిక మేరకు స్వస్థలంలోనే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. చార్మినార్ సమీపంలోని చౌమాహల్లా ప్యాలెస్ కు తరలించి అసఫ్ జాహీ సమాధుల వద్ద ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

అధికారిక లాంఛనాలతో…

ఎనిమిదవ నిజాం నవాబ్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 17న హైదరాబాద్ కు చేరుకోనున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఎనిమిదో నిజాం కుటుంబ సభ్యులతో సమన్వయ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకె ఖాన్ కు అప్పగించారు. ముకర్రం జా అంత్యక్రియలను అత్యున్నత స్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

సెలవు ప్రకటించండి…

ఈ నెల 17న ఎనిమిదో నిజాం నవాబు అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

You cannot copy content of this page