దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్… 9మంది మృతి

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లో ఆపరేషన్ జలశక్తి కొనసాగిస్తున్నాయి బలగాలు. ఓ వైపున భారీ వర్షాలు కురుస్తున్నా మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్లలో నిమగ్నం అయ్యాయి. మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహధ్దు అటవీ ప్రాంతలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది నక్సల్స్ చనిపోయారని దంతెవాడ జిల్లా పోలీసు అదికారులు తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్ లో పీఎల్జీఏ 2 ప్లాటూన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు వివరించారు. ఘటనా స్థలం నుండి ఒక ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 315 బోర్ రైఫిల్ తో పాటు ఇతరాత్ర స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

You cannot copy content of this page