121 ఏళ్ల రికార్డ్ బ్రేక్… కృష్ణ వరదల తీరు…

దిశ దశ, ఏపీ బ్యూరో:

కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది… 121 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు కృష్ణా నదిలో రాలేదని అధికారులు చెప్తున్నారు. 11,33,076 క్యూసెక్కుల వరద నీరు ఈ సారి కృష్ణా నదికి వచ్చి చేరిందని అధికారులు వివరించారు. 1903లో 10 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నమోదు కాగా, 2009 అక్టోబర్ లో వచ్చిన వరదలప్పుడు 11.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఈ సారి అదనంగా 23 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండడంతో 121 ఏళ్లలో అత్యధిక రికార్డును బ్రేక్ చేసినట్టయింది. 2009లో వచ్చిన వరదల వల్ల ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణ, తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు వరద బీభత్సం సృష్టించింది. అప్పుడు కర్నూలు నగరంలో మూడు రోజుల పాటు 3 మీటర్ల మేర వరద నీరు నిలిచిపోయింది. అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మీదుగా వరద నీరు పోటెత్తగా ఈ సారి దిగువ ప్రాంతం నుండి ఎక్కువగా వరద నీరు వచ్చింది. దీంతో తెలంగాణలోని నల్గొండ హైవే, ఏపీలోని నందిగామ రహదారులు నీట మునిగిపోయాయి. సూర్యపేట, కోదాడ ప్రాంతాల్లో ఈ సారి వరద నీటి ప్రభావం ఉండగా ఎగువ ప్రాంతంలో మాత్రం ఎపెక్ట్ అంతగా లేదు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం కూడా 2009నాటి వరదలప్పుడు నీట మునిగింది. అప్పడు వచ్చిన వరదలను వెయ్యేళ్లలోనే ఈ స్థాయిలో వరదలు రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా 11.30 లక్షల వరద నీరు రావడంతో గతంలో వచ్చిన ఫ్లడ్ కంటే ఎక్కువేనని స్పష్టం అవుతోంది.  కృష్ణ నది వరద ఉధృతి కారణంగా మున్నేరు, బుడమేరు నదుల నుండి వెల్తున్న నీరు ఒత్తిడికి గురవుతోంది. దీంతో కృష్ణా నదిలో కలవాల్సిన ఈ రెండు నదుల నీరు అంతా వెనక్కి వచ్చి సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

బ్యారేజీకి డ్యామేజీ…

ఏపీలోని విజయవాడ పట్టణంలోని పలు ప్రాంతాలు వరద నీటిమయం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు చెందిన బోట్ల తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ వరద ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం కృష్ణా నదిలో నిర్మించిన రిటర్నింగ్ వాల్ వల్ల కూడా సమీప ప్రాంత వాసులు ముంపునకు గురికాలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణాలో వరద బీభత్సం వల్ల మూడు బోట్లు కొట్టుకపోయి బ్యారేజీ గేట్ల వద్దకు వచ్చి చేరాయి. దీంతో ఇక్కడి గేట్లను ఎత్తినప్పటికీ నీరు అంచనాకు తగ్గట్టుగా దిగువకు వెల్లడం లేదు. మరో వైపున వరద ఒత్తిడి కూడా తీవ్రంగా ఉండడంతో ప్రకాషం బ్యారేజ్ అక్కడ అక్కడ దెబ్బతిన్నది. రాజధాని అమరవాతితో పాటు పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో ఏపీ సీఎం క్యాంపు ఆఫీసును తాత్కాలికంగా విజయవాడ కలెక్టరేట్ కు మార్చారు. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద ఉధృతి మరింత తీవ్ర రూపం దాల్చినట్టయితే విజయవాడ పట్టణంతో పాటు పలు ప్రాంతాలు డేంజర్ జోన్ లోకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక ఇక్కడ అమల్లో ఉంది.

You cannot copy content of this page