భూతవైద్యం పేరుతో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రతి రోజుకు ఎక్కడో చోట అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భూత వైద్యం పేరుతో ఓ మాంత్రికుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఢిల్లీకి చెందిన ఓ భూత వైద్యుడు 14ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తల్లి భూత వైద్యం కోసం ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లింది. భూత వైద్యం ముసుగులో నిందితుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి చేశాడు. బాలిక రెండు నెలల గర్భిణి అని తేలడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న బాబా హరిదాస్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత కొంత కాలంగా బాలిక ఆరోగ్యం బాగా లేదు. ఆ తర్వాత దీన్ని అలుసుగా భావించి నిందితుడు తరుచుగా బాలిక ఇంటికి వచ్చి, తల్లిని గది నుంచి బయటకు పంపి బాలికపై అత్యాచారం చేసేవాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page