ఏ బంధంలో అయినా గొడవలు సర్వసాధారణం. కొందరు ఆ గొడవలను సర్ధిపుచ్చుకుంటారు. మరు కొందరు మాత్రం పెద్దవి చేసుకుని క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడుతో జరిగింది. తన ప్రియుడు మోసం చేశాడని కోపంలో ప్రియురాలు అతడిపై సలసల మరిగే నూనే పోసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈరోడ్ జిల్లా చెందిన కార్తి అనే యువకుడు పెరుందురైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతని బంధువైన మీనా దేవితో కార్తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇలా కొన్నాళ్లు ప్రేమించుకున్నాకా.. కార్తి తన బంధువైన మీనాను పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. కానీ, కార్తి మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయితో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. అయితే కార్తి ఎంగేజ్‌మెంట్ విషయం మీనా దేవికి తెలిసింది. కార్తిని నిలదీసింది. దీంతో కార్తికి, మీనాకు తరచు గొడవలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే మరోసారి మీనా.. కార్తిని కలవడానికి వెళ్లినప్పుడు వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరగా.. మీనా క్షణికావేశంలో కార్తిపై సలసల మరిగే నూనెను పోసేసింది. దీంతో కార్తి ముఖం, చేతులు కాలిపోవడంతో సహాయం కోసం అరుపులు వేశాడు. అతడి అరుపులు విన్న కొంత మంది అక్కడికి వచ్చి వెంటనే కార్తిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనాదేవిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.