వరద నీటిలో కొట్టుకపోయిన కారు…

ఖమ్మం జిల్లా కారేపల్లి వాసులు…

దిశ దశ, వరంగల్:

వరద ప్రవాహం కారణంగా తండ్రి కూతుళ్లు గల్లంతయినట్టుగా తెలుస్తోంది. బెంగుళూరుకు వెల్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెల్లిన తండ్రి, కూతుర్లు ఆకేరు వాగు వరదలో కొట్టుకపోయినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నునావత్ మోతిలాల్, ఆయన కూతురు అశ్వినీలు కారులో బయలుదేరారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిపై నుండి ఆకేరు వాగు ఉధృతంగా వరద నీరు పొంగిపొర్లుతుండడంతో అదుపు తప్పిన కారు వరద నీటిలో కొట్టుకపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న మోతిలాల్, అశ్వినీలు తమ కారు వాగులోకి అదుపుతప్పి కొట్టుకపోయిందని, తాము వరద నీటిలో మొడ వరకు చిక్కుకుని ఉన్నామని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తరువాత వారి ఫోన్లు స్విచ్ఛాప్ వస్తుండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page