దిశ దశ, కరీంనగర్:
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోడల్లుడు, రాజ్య సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవిందర్ రావుపై కేసు నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. క్రైం నంబర్ 145/16.02.2024, ఐపీసీ సెక్షన్ 153, 504 r/w 34లలో ఈ కేసు నమోదు చేశారు. సంఘటన వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ టూ టౌన్ పరిధిలోని రాంనగర్ ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటున్న కూస రవిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగినపల్లిి రవిందర్ రావు, గూడ బాలకృష్ణ, అవుల నాగరాజు, ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్ లపై కేసు నమోదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనచరుడు అయిన కూస రవిందర్ భూ దందాలకు పాల్పుడుతున్నాడని ఆరోపణలు చేస్తూ న్యూస్ ప్రసారం చేశారు. ఆర్డీఓను బెదిరింపులకు గురి చేసి భ కబ్జాకు పాల్పడినట్టుగా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తనకు ప్రభుత్వం కెటాయించిన భూమిలోనే ఇల్లు నిర్మించుకున్నానని రవిందర్ అంటున్నారు. నిర్వాసితుల కింద ఇచ్చిన తన భూమి విషయంలో కబ్జాలకు పాల్పడినట్టుగా ప్రసారం చేసిన ఈ వార్తను పలు సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా వైరల్ చేశారని కూస రవిందర్ వివరించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినానికి గంటల ముందే ఈ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
dishadasha
1232 posts
Prev Post
Next Post