దిశ దశ, కరీంనగర్:
ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎల్ఈడీ స్క్రీన్ పై దాడి చేసిన ప్రభుత్వ టీచర్ పై కేసు నమోదు అయింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురం గ్రామంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ లతో కూడిన వాహానాన్ని నిలిపారు. గంగుల కమాలకార్ కు ఓటేయాలంటూ ఎల్ఈడీ స్క్రీన్ ల ద్వారా ప్రచారం కార్యక్రమం జరుపుతున్నారు. ఈ క్రమంలో స్క్రీన్ పై మంత్రి గంగుల కమలాకర్ ఫోటో రాగానే శ్రీరామోజు జగదీశ్వరా చారి అలియాస్ జగతి అనే ప్రభుత్వ టీచర్ తన చెప్పుతో స్క్రీన్ పై కొట్టి దుర్భాషలాడాడు. ఈ మేరకు గ్రామానికి చెందిన అరె ప్రశాంత్ కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టీచర్ జగదీశ్వరాచారిపై ఐపీసీ సెక్షన్ 290బి, 290, 504 సెక్షన్లలో కేసు నమోదు చేశారు.