ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ నాయకులు

దిశ దశ, హుజరాబాద్:

ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళ ప్రజా ప్రతినిధి అయిన ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలని వారు కోరారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న బిజెపి నాయకులను సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు రమాదేవి, సుశీల, లావణ్య, కిషన్ కుమార్ యాదగిరి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page