తల్లడిల్లిపోయే తల్లుల కోసం…

సర్కారు ఉద్యోగులకు వరం…

ఓట్లు వేసే ప్రజల కోసమే కాదు నా నియోజకవర్గ ప్రజల సంక్షేమమూ నాకు ముఖ్యం. డ్యూటీలు చేసే ఉద్యోగులు మనసొక చోట… మనిషోక చోట అన్న రీతిలో విధులు నిర్వర్తించడం వల్ల ఫలితం లేదని గమనించిన ప్రభుత్వం ప్రత్యేకంగా చైల్డ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం ఆరంభింది. ఇందులో భాంగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ ఆవరణలో ఉద్యోగుల పిల్లల కేసం ఈ కేంద్రం ముస్తాబయింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న ఈ కేంద్రంలో ఉద్యోగుల పిల్లల సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.

వీరికి మాత్రమే…

ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వయసులో ఉన్న తమ పిల్లలను మాత్రమే క్రీచ్ సెంటర్లో దింపి తల్లులు తమ విధులు నిర్వర్తించుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శిశువులను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించిన అధికారులు ఉద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆట వస్తువుల, ఊయలలు, రెస్ట్ రూం, తమ పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేకంగా మదర్ ఫీడ్ రూం ఇలా అన్ని రకాలుగా ఈ కేంద్రంలో సౌకర్యాలను కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కేంద్రాన్ని సిద్దం చేశారు. జిల్లాలోని సమీకృత కార్యాలయాన్ని ఒకే చోట ఉన్నందు ఈ కేంద్రాన్ని ఇదే ఆవరణలో ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులకు కూడా ఇబ్బంది తప్పినట్టయింది. తమ కళ్ల ముందే తమ ఆశల సౌధాలు ఎదుగుతుంటే ఆనందంతో విధులు నిర్వర్తించే అవకాశం ఉండనుంది.

You cannot copy content of this page