మరణించిన వ్యక్తి బ్రతికాడోచ్…

దిశ దశ, జాతీయం:

మరణించాడని డాక్టర్లు ప్రకటించిన తరువాత కూడా ఓ వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. గుండె పోటుతో కుప్పకూలిపోయిన వ్యక్తి అనంత వాయువులో కలిసిపోయాడనుకున్న అతను మాత్రం జీవించి ఉండడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. ఇంతకీ ఏం జరిగిందంటే… మహారాష్ట్రంలోని కొల్హాపూర్ కు చెందిన పాండురంగ్ అనే వ్యక్తి గత డిసెంబర్ 16న తన కుప్పకూలి పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్ప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు. దీంతో పాండు రంగ్ అంతిమసంస్కారం నిర్వహించేందుకు అతని బంధువులు అంబూలెన్స్ లో తమ గ్రామానికి బయులుదేరారు. ఇంటివద్ద కూడా పాండురంగ్ అంత్యక్రియలు జరిపించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. అంబూలెన్స్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రహదారిపై ఉన్న ఓ స్పీడ్ బ్రేకర్ ను గమనించని డ్రైవర్ అంబూలెన్స్ ను వేగంగా నడుపుతున్నాడు. స్పీడ్ బ్రేకర్ కారణంగా భారీ కుదుపునకు గురి కావడంతో అంబూలెన్స్ లో ప్రయాణిస్తున్న వారంతా కూడా అతలాకుతలం అయ్యారు. కొద్ది క్షణాల తరువాత యథావిధిగా వెల్తున్న అంబూలెన్స్ లో ఉన్న పాండురంగ్ మృతదేహంలో కదలికలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా… ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని వైద్యులు గమనించారు. పాండురంగ్ కు యాంజియో ప్లాస్ట్ సర్జరీ నిర్వహించడంతో అతను కోలుకున్నాడు. పక్షం రోజుల పాటు చికిత్స అందుకున్న ఆయన ఇటీవల సొంత ఇంటికి చేరుకున్నాడు. మరణించాడుకున్న పాండురంగ్ ప్రాణాలతో బ్రతికి బట్టకట్టడంతో అతని బంధువులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

సీపీఆర్ ఎఫెక్టా..?

అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పాండురంగ్ కు వెంటనే సీపీఆర్ చేసి ఉంటే అప్పుడే బ్రతికేవాడేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక్కోసారి హార్ట్ బీట్ ఒక్కసారిగా స్తంభించిపోతుండడంతో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారికి వెంటనే సీపీఆర్ చేసినట్టయితే బ్రతికే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో సీపీఆర్ విధానంపై పోలీసులు కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలిన వారిని సీపీఆర్ ద్వారా బ్రతికించిన సందర్భాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన పాండురంగ్ సడెన్ గా కుప్పకూలిపడిపోయిన తరువాత సీపీఆర్ చేయనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో అంబూలెన్స్ స్పీడ్ బ్రేకర్ మీదుగా అతి వేగంగా వెళ్లడంతో భారీ కుదుపునకు గురైంది. దీంతో పాండురంగ్ హార్ట్ సాధారనణ స్థితి చేరుకోవడంతో అతని చేతుల్లో కదలిక మొదలై ఉంటుందని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా మరికొద్ది సేపట్లో అఖరి మజిలీకి చేరుకోవల్సిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడం మాత్రం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page