దిశ దశ, జగిత్యాల:
చారిత్రాత్మక ఆలయాన్ని పునరుద్దరించాలని సంకల్పంచిన ఆ భక్తుని కోరిక కార్యరూపం దాల్చింది. పవన సుతుని ఆలయం కోసం పరితపించిన ఆ భక్తుని ఆశయానికి అనుగుణంగా దాతలు కూడా ముందుకు రావడంతో ఆలయం రూపు దిద్దుకుంది. తన కోర్కెను నెరవేర్చినందుకు మొక్కు తీర్చుకునేందుకు ఆ భక్తుడు కాలి నడకన కొండగట్టుకు చేరుకున్నాడు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పాతచర్ల గ్రామంలో పురాతన కాలంనాటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పునరుద్దరించాలని మత్స వీర్రాజు అనే భక్తుడు సంకల్పించాడు. ఆయన కోరిక మేరకు దాతలు కూడా ముందుకు రావడంతో ఆలయ నిర్మాణం చకాచకా పూర్తయింది. తాన కొర్కె నెరవేర్చినందుకు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి ఆ భక్తుడు కాలినడకన చేరుకున్నాడు. ఈ నెల 6న పాతచర్లలోని శ్రీ సీతారామచంద్ర భక్తాంజనేయ స్వామి ఆలయం నుండి కాలి నడకన బయలు దేరిన వీర్రాజు శనివారం రాత్రి కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నాడు. 300 కిలో మీటర్ల మేర కాలినడకన ఒంటరి ప్రయాణం చేసిన వీర్రాజు తనకు మార్గ మాధ్యలో అంజన్న సన్నిధులు ఆశ్రయం ఇచ్చాయని వివరించారు.