వడదెబ్బకు గురై ఐదేళ్ల బాలుడి మృతి

దిశ దశ, రామడుగు:

అప్పటి వరకు ఆడుకుంటున్న తమ బిడ్డ విగతజీవిగా మారిన తీరు స్థానికుల్లోల విషాదాన్ని నింపింది. ఉన్నతంగా ఎదుగుతాడని కలలుకన్న తమ బిడ్డ కానరాని లోకాలకు చేరడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భానుడి భగభగల కారణంగా ఓ బాలుడు మరణించిన ఘటన కరీంనగర్ రామడుగు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గోపాల్ రావుపేట్ గ్రామానికి చెందిన యశ్వంత్ బుధవారం (5) ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. ఎండలో ఆడుకుని ఇంటికి వచ్చిన యశ్వంత్ దాహార్తితో నీటిని తాగిన కొద్ది నిమిషాల్లోనే అనారోగ్యానికి గుర్తై పడిపోయాడు. యశ్వంత్ ను అక్కున చేర్చుకునే సరికే ప్రాణాలు కొల్పోయాడు. వడదెబ్బ కారణంగానే బాలుడు మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. యశ్వంత్ తల్లిదండ్రులు కళ్లెం అంజయ్య, పుష్పలకు ఓ బాబు, పాప కాగా, బాబు యశ్వంత్ బుధవారం చనిపోయాడని వారు వివరించారు. నిరుపేద కుటుండానికి చెందిన అంజయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

You cannot copy content of this page