దళితబంధు స్కీంతో భారీ ప్రాజెక్ట్…

రైస్ మిల్లు స్టార్ట్ చేసిన లబ్దిదారులు

రాష్ట్రంలోనే ఇది తొలి యూనిట్

దళితబంధు పథకం ద్వారా ఇచ్చే సాయంతో సరైన వ్యాపారం ఎంచుకోండి… మార్కెటింగ్ కల్పించేందుకు అధికారులు చొరవ తీసుకోండి… అందరూ ఒకటే యూనిట్ సెలక్ట్ చేసుకుని ఆగం కాకండి.. మీ ఆర్థికాభివృద్ది కోసం దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాన్ని తీసుకొచ్చాం: ఇవి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు స్కీం ప్రారంభోత్సవం సదర్భంగా చేసిన వ్యాఖ్యలు.

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

అయితే చాలామంది కూడా ఒకే యూనిట్ సెలక్ట్ చేసుకుని ఉపాధి అవకాశాలు గండిపెట్టుకుంటున్నారు. వాహనాలు, డైయిరీలు ఇలాంటివన్ని ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎంపిక చేసుకుంటున్నారు. దీనివల్ల వ్యాపార వృద్ది జరగకపోగా వ్యాపారంలో నష్టాలు చవి చూసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే హెచ్చరించారు. కానీ చాలా మంది మాత్రం తమ పంథా వీడకుండా ముందుకు సాగుతున్నారు. కొంతమంది మాత్రం కాస్తా డిఫరెంట్ బిజినెస్ ఎంచుకుంటున్నారు. ఒకరిద్దరు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలోఅద్దెకు నడుపుతుండగా మరికొంత మంది ఇతర వ్యాపారాలపై మక్కువ చూపుతున్నారు. వీరందరికీ వైవిద్యంగా ఆలోచించిన వీరు మరో అడుగు ముందుకేసి ఏకంగా రైస్ మిల్లు పెట్టుకున్నారు. దళితబంధు చరిత్రలోనే ఇదే తొలి యూనిట్ కూడా కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఆదాయం నికరంగా వచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకుని ఏకంగా రైస్ మిల్లునే స్థాపించారు.

మిల్లుకు చేరిన ప్యాడీ బ్యాగ్స్

అదెలా సాధ్యం..?

ముగ్గురు దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం రూ. 30 లక్షలే కదా రూ. 3 కోట్లతో రైస్ మిల్లు ఎలా ప్రారంభిచారని అనుకుంటున్నారా..? అయితే ఇక్కడే వారు లాజిక్ ఉపయోగించారు. సర్కారు అందించిన సాయం మొత్తాన్ని కలిపి బ్యాంకులోనే డిపాజిట్ కు చూపించి రూ. 3 కోట్ల రుణం పొందారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుధామల్ల రాజేశ్వరి, సుధామల్ల విజయ్ కుమార్, వీర్నపల్లికి డప్పుల లింగయ్యలు ఓ గ్రూపుగా ఏర్పడి రైస్ మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. రాజేశ్వరి భర్త సురేందర్, లింగయ్యలకు లారీలు ఉండగా, విజయ్ కుమార్ గల్ఫ్ నుండి తిరిగివచ్చి ధుమాల సమీపంలో వ్యవసాయ భూమి 3 ఎకరాలు కొనుగలో చేసుకున్నారు. వీరు ముగ్గురు కలిసి సమాలోచనలు జరిపి దళితబంధు పథకం ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని జీవనం సాగించాలని నిర్ణయించి ఈ దిశగా ముందుకు సాగారు. దళిత బంధు స్కీం ద్వారా రైస్ మిల్లు ఏర్పాటు చేసిన తొలి యూనిట్ రాష్ట్రంలోనే మొదటిది కావడం విశేషం.

రైస్ మిల్లు (ఇన్ సైడ్)

యూనిట్ సెలక్షన్ వెనక..?

అయితే దళితబంధు స్కీం ద్వారా ఏకంగా రైస్ మిల్లు పెట్టాలన్న యోచన వెనక ముగ్గురు లబ్దిదారుల అంచనాలు కూడా తోడయ్యాయని చెప్పకతప్పదు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన వరిధ్యానం సాగును దృష్టిలో పెట్టుకునే వీరు రైస్ మిల్లు ఏర్పాటు వైపు అడుగులు వేశారు. రెండు సీజన్లలో కూడా వరి సాగవుతుండడంతో ఎల్లారెడ్డిపేట ప్రాంతంలో తక్కువగా ఉన్న రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నట్టయితే సక్సెస్ అవుతామని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆదర్శవంతమైన ఎంపిక: మంత్రి కేటీ రామారావు.

దళిత బంధు స్కీం ద్వారా ముగ్గురు బెనిఫిషర్స్ కలిసి ఎంపిక చేసుకున్న యూనిట్ రాష్ట్రంలోని దళితులందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ద‌ళితులు ఆర్థికంగా, అన్ని రంగాల్లో రాణించాల‌నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. రైస్ మిల్ యూనిట్ ను స్థాపించాలనుకోవడం గొప్ప నిర్ణయం. ఈ యూనిట్ కు భీమా చేయించడంతో పాటు యూనిట్ సక్సెస్ పుల్ గా నడుపాలి. రాష్ట్రం మొత్తానికి ఈ రైస్ మిల్ రోల్ మోడల్ గా నిలవాలి. ఇలాంటి భారీ యూనిట్లను ఎంపిక చేసుకునేందుకు భాగస్వాములు ఏకతాటిపైకి రావడమే కాకుండా వ్యాపారాన్ని నిరాటంకంగా నడుపుతూ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాను.

You cannot copy content of this page