దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఐటీబీపీ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు పోలీసులు గాయాల పాలయ్యారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి తిరుగు ప్రయాణం అయిన జవాన్లపై జిల్లాలోని కొడియార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పేల్చివేత ఘటనలో ఆంద్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఐటీబీపీ 53వ బెటాలియన్ జవాన్ కె రాజేశ్ (36), మహారాష్టలోని సతారా జిల్లాకు చెందిన అమర్ పన్వార్ (36) మృత్యువాత పడ్డారు. నారాయణపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులు కూడా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన రాజేశ్ ఈ ఘటనలో మృత్యువాత పడడంతో ఆయన స్వగ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.