మందుపాతర పేలి స్థానికుడి మృతి…

మరోకరి గల్లంతు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ నక్సల్స్ పేల్చిన మందుపాతరలో ఒకరు మరణించగా మరోకరు గల్లంతయ్యారు. చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. నారాయణపూర్ జిల్లా ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమాడై కొండపై శుక్రవారం మందుపాతర పేల్చడంతో రాజ్‌పూర్ కు చెందిన రితేష్ గగ్గా(21)గా గుర్తించారు. ఈ ఘటనలో ఛోటెడోంగర్ కు చెందిన శ్రవణ్ గగ్గా (24) గల్లంతయ్యారు. అతని ఆచూకి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరు కూడా సామాన్య జీవనం సాగిస్తున్న వారేనని తెలుస్తోంది. అయితే మావోయిస్టులు మందుపాతర పేల్చడానికి కారణాలు ఏంటి అన్నది తెలియరావడం లేదు. సాధారణ పౌరులను లక్ష్యం చేసుకుని మావోయిస్టులు మందుపాతరలు పేల్చడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రాంతంలో బలగాలు సంచరిస్తున్నాయన్న సమాచారం అందుకుని ఈ దాడులకు పాల్పడ్డారా లేక సామాన్య పౌరులే లక్ష్యంగా పెట్టుకుని పేల్చివేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. చత్తీస్ గడ్ లో ఎన్నికలు ముగిసిన తరువాత మావోయిస్టులు ఎక్కువగా విద్వంసకర ఘటనలకు పాల్పడుతుండడంతో పాటు టార్గెట్ల కోసం వేట మొదలు పెట్టడంతో దండకారణ్య అటవీ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు తయారయ్యాయి.

You cannot copy content of this page