దిశ దశ, దండకారణ్యం: చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మళ్లీ అలజడి రేకెత్తింది. అడవుల్లో సంచరిస్తున్న జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలోని సుక్మా జిల్లా సలాటొంగ్ వద్ద క్లైమోర్ మైన్స్ (డ్రగ్ కంటైనర్లు)ను పేల్చడంతో పలువురు జవాన్లు గాయాల పాలయ్యారు.
డబ్బా మార్క్ క్యాంప్ నుండి సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లకు వెలుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ పేల్చివేత ఘటనలో లక్ష్మన్ టేటన్, భీమా, అరుణ్ ఎం కార్తీకలకు గాయాలు కాగా మాంతూ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.