మీ బోధన అద్భుతం… టీచర్ కు అభినందన లేఖ

దిశ దశ, మెదక్:

విద్యనందించే ఉపాధ్యాయులు తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరుకు అభినందనలు అందించే సంస్కృతి మొదలైంది రాష్ట్రంలో. తాము బోధించే పాఠ్యాంశాల్లో విద్యార్థులు చురుగ్గా రాణించేందుకు టీచర్లు చూపించే ప్రత్యేక శ్రద్దను గమనించి ఉన్నతాధికారులు అభినందించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు  విద్యాశాఖ అధికారులు. రాష్ట్రంలోనే తోలిసారి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న టీచర్ సుజాతను అభినందిస్తూ లేఖ రాశారు విద్యాశాఖ అధికారులు ఈ నెల 27న SCERT డైరక్టర్ జి రమేష్ మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రైమరి స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా క్లాసు రూముల్లో టీచింగ్, లర్నింగ్ విధానాన్ని ప్రత్యక్ష్యంగా
పరిశీలించారు. విద్యార్థులు గణిత పాఠ్యాంశంలో అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శించడం డైర్టకర్ రమేష్ ను ఆకట్టుకుంది. విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్టులో చూపించిన ప్రతిభను గమనించిన ఆయన టీచర్ సుజాతను అభినందిస్తూ లేఖ రాయాలని డీఈఓను ఆదేశించారు. ఈ మేరకు హవేలి ఘన్ పూర్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ సుజాతకు మెదక్ డీఈఓ లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ఉపాధ్యాయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాశంగా మారింది. బోధనలో విద్యార్థులను ఆకట్టుకోవడమే కాకుండా వారిని ప్రతిభకు పదును పెడుతున్న ఉపాధ్యాయులను ఇలా అభినందించడం నూతన సాంప్రాదాయమంటూ టీచర్లు అంటున్నారు. ఇలాంటి ప్రోత్సాహం ఉన్నాతాధికారుల నుండి తరుచూ అందించినట్టయితే ఉపాధ్యాయ వర్గాల్లో స్పూర్తి నింపినట్టు అవుతుందంటున్నారు. అభినందన లేఖ పంపడం వల్ల టీచర్లు మరింత ఉత్సాహంతో విద్యార్థులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page