స్వైప్ మిషన్ వల్ల పైకి పోయిన ప్రాణం

స్వైప్ మిషన్ పనిచేయని పాపానికి ఓ ప్రాణమే గాలిలో కలిసి పోయింది. పంప్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తిపై యువకులు పిడి గుద్దులు గుద్ది చంపిన ఘటన మహానగరంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని జాన్వాడా హెచ్ పి పెట్రోల్ బంకుకు కారులో వచ్చిన ముగ్గురు యువకులు అర్థరాత్రి ఇంధనం కావాలని అడిగారు. అర్థరాత్రి 12 అవవుతున్నందున పెట్రోల్ బంకు క్లోజ్ చేశామని చెప్పినప్పటికీ బ్రతిమిలాడిన ఆ యువకులు తాము చాలా దూరం వెల్లాలని ఇంధనం పోయాలని అభ్యర్థించారు. దీంతో కనికరించిన పెట్రోల్ బంకు సిబ్బంది సమ్మతించారు. అయితే ఇంధనం నింపిన తరువాత స్వైప్ చేయాలని కార్డు ఇవ్వగా ఆ కార్డు పనిచేయలేదు. దీంతో క్యాష్ ఇవ్వాలని కోరగా ఎదురు మాట్లాడుతావా అంటూ క్యాషీయర్ చోటుపై దాడికి పాల్పడ్డారు. అదే బంకులో పనిచేస్తున్న సంజయ్ కొట్టవద్దంటూ అడ్డురాగా అతనిపైనా పిడిగుద్దులతో దాడి చేశారు. దీంతో అక్కడే పడిపోయిన సంజయ్ ని గమనించిన యువకులు కారులో పరార్ కాగా, అపస్మారక స్థితికి చేరుకున్న సంజయ్ ని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. నిందితులు జాన్వాడకు చెందిన నరేందర్, మల్లేష్, అనూప్ లుగా పోలీసులు గుర్తించారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

You cannot copy content of this page