డామిట్ కథ అడ్డం తిరిగిందే… అమ్మను చంపి… సహజ మరణంగా చూపించి…

దిశ దశ, హైదరాబాద్:

ఇంటిని అమ్మకానికి పెడితే అడ్డుకుంది ఓ అమ్మ… అడ్డుకున్న ఆ అమ్మనే కడతేరిస్తే తనకిక అడ్డంకే ఉండదనుకున్నాడో కొడుకు. అనుకున్నదే తడవుగా స్కెచ్ వేసుకున్న ఆ ప్రబుద్దుడు ఎవరికీ అనుమానం రాకుండా తల్లిని హతం చేశాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… హైదరబాద్ లోని రామంతాపూర్ కు చెందిన సుగుణమ్మ పేరిట ఉన్న ఇంటిని అమ్మాలని ఆమె కొడుకు అనిల్, కోడలు ప్రయత్నించారు. అయితే సుగుణమ్మ మాత్రం ఇంటిని విక్రయించేందుకు ససేమిరా అనడంతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. దీంతో స్థిరాస్థిని అమ్మాలంటే ఏం చేయాలి అని ఆలోచించిన కొడుకు అనిల్, కోడలు తిరుమలలు పకడ్భందీ వ్యూహం రచించి సుగుణమ్మను హతం చేశారు. తన తల్లి చనిపోయిందని బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆమె చివరి చూపు చూసేందుకు అంతా రామంతపూర్ చేరుకున్నారు.

అడ్డం తిరిగిన కథ…

అయితే సుగుణమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బంధువులకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా ఇంటి విషయంలో తల్లి కొడుకుల మధ్య విబేధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అంతా బాగానే ఉన్న సుగుణమ్మ ఎలా చనిపోయింది అన్న అనుమానమూ వారిని వెంటాడింది. సుగుణమ్మది సహజ మరణం కాదని హత్యే అయి ఉంటుందని అనుమానించిన బంధువులు వెంటనే ఉప్పల్ పో్లీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుగుణమ్మ కొడుకు అనిల్, కోడలు తిరుమలతో పాటు ఈ హత్యకు సహరించాడన్న అనుమానంతో వారి స్నేహితుడిని కూడా కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page