ఆర్టీసీ అధికారులకు ముచ్చెమటలు…

పెట్రోలో డబ్బాతో వ్యక్తి హల్ చల్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో ఓ వ్యక్తి పెట్రోల్ డబ్బా పట్టుకుని హల్ చల్ చేశాడు. బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చివరకు అతన్ని చేజిక్కుంచుకున్న పోలీసులు ఆర్ ఎం కార్యాలయానికి తరలించారు. ఆర్టీసీ అధికారులు చెప్తున్న కథనం ప్రకారం…. బస్ స్టేషన్ ఆవరణలోని షాపులను రెండు సంవత్సరాల నుండి లీజుకు తీసుకొని నడిపిస్తున్న అజీమ్ అద్దె చెల్లించడం లేదు. దీంతో బకాయి పడ్డ అద్దెకు సంబందించిన డబ్బులు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు దుకాణ సముదాయం వద్దకు వచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారుల ముందు పెట్రోల్ డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అతన్ని మెప్పించి ఒప్పించి ఆర్ ఎం కార్యాలయానికి తీసుకెళ్లారు. అజీమ్ లీజుకు తీసుకున్న నాలుగు షాపుల అద్దె గత నాలుగైదు నెలల నుండి చెల్లించడం లేదని అధికారులు తెలిపారు. వ్యాపారం మాత్రం నడిపించుకుంటున్నప్పటికీ సంస్థకు అద్దె చెల్లించడం లేదని అడిగేందుకు వెల్తే పెట్రోల్ డబ్బా పట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని వివరించారు. సదరు వ్యక్తి అద్దెకు తీసుకున్న షాప్ నెంబర్లు 45, 56, 58, 103లకు సంబందించిన అద్దె బకాయి రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉందని స్టేషన్ మేనేజర్ అంజయ్య తెలిపారు. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్నిమాటల్లోకి దింపి అజీమ్ నుండి పెట్రోల్ డబ్బాను లాగేసుకున్నారు. అనంతరం పోలీసులు అతన్ని ఆర్ఎంఓ ఆఫీస్ కు తరలించారు.

You cannot copy content of this page