మహిళల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చట్టాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట, ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు కనిపిస్తే చాలు కామోన్మాదులు రెచ్చిపోతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడి ఎవరికి చెప్పొద్దని బాధితులను, వారి కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలుడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఆయన.. సమీప బంధువు కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికను వైద్యులు పరీక్షించి గర్భవతి అని తేల్చారు.
దీంతో ఎవరు ఇలా చేశారంటూ బాలికపై తల్లి ఒత్తిడి చేసింది. చివరకు ఆ మైనర్ బాలిక నోరు విప్పింది. తనను మూడు నెలల నుంచి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మరెవరో కాదు తన బావ అని చెప్పింది. ఇంట్లో ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడని తెలిపింది. దీంతో తను ఇంట్లో చెప్పలేకపోయానని తల్లిని పట్టుకుని ఏడ్చింది. వెంటనే బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ 376, పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన కూతురు అభం శుభం తెలియని చిన్న పిల్ల అని తల్లి కన్నీరు పెట్టుకుంది. బాలికపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడేందుకు ఎలా మనసు వచ్చిందని గుండెలు బాదుకుంది. తన కూతురి జీవితం ఇప్పుడు ఎలా అంటూ వాపోయింది.