మరింత కుంగిన బ్యారేజ్…

ఎక్స్ క్లూజివ్ ఫోటోలు…

దిశ దశ, భూపాలపల్లి:

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు, పగుళ్లు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోల్లో బ్యారేజీకి సంబంధించిన కుంగుబాటు, పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బ్యారేజీకి మరమ్మత్తులు కూడా చేసే పరిస్థితి లేకపోవడంతో దానిని అలాగే వదిలేయడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది అధికారులకు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలో కూడా నిర్మాణంలో డొల్లతనం స్పష్టంగా పేర్కొంది. 7వ బ్లాకులోని పిల్లర్లకు సంబంధించిన లోపాలను ఎత్తి చూపుతూ రిపేర్లు చేయడం కష్టమేనని కూడా తేల్చి చెప్పింది. దీంతో బ్యారేజీ క్రమక్రమంగా పతనం అవడం తప్ప మరో అవకాశం అయితే అధికారులకు లేకుండా పోయింది. చారిత్రాత్మకమైన కట్టడంగా తెలంగాణ వాసులకు సిగలో నగగా మారిందనుకున్న బ్యారేజీ కుంగిపోవడం అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుకే శిర స్థానంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో సమస్య ఏర్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇచ్చే వరకు కూడా బ్యారేజీలో మరమ్మత్తులో చేస్తే బాగవుతుందని అందరు అనుకున్నారు. కానీ నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల బృందం బ్యారేజీ డ్యామేజీని సరిదిద్దడం మాత్రం కుదిరే అవకాశమే లేదని స్పష్టం చేయడంతో దానిని అలాగే వదిలేయాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. క్రమక్రమంగా పగుళ్లు విస్తరిస్తుండడం, కుంగుబాటుకు గురవుతుండడంతో మేడిగడ్డ బ్యారేజీ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నదన్న ఆవేదన అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

You cannot copy content of this page