మెజార్టీలో ఆయనదే రికార్డు…

దిశ దశ, జాతీయం: 

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల మెజార్టీ గురించి రికార్డులపై చర్చ జరుగుతోంది. అయితే అత్యధిక మెజార్టీ సాధించి దేశంలోనే అరుదైన రికార్డు అందుకున్న వారి గురించి గొప్పగా వింటుంటాం. కానీ అక్కడ మాత్రం ఈ అభ్యర్థి అతి తక్కువ మెజార్టీ సాధించి సరికొత్త రికార్డు సాధించాడు. 25 ఓట్లు ఎక్కువగా ప్రత్యర్థికి పడినట్టయితే గెలిచిన అభ్యర్థి తల రాతే మారిపోయింది. మహారాష్ట్రలోని ముంబాయి నార్త్ వెస్ట్ నుండి లోకసభకు ఎంపికయిన ఆ ఎంపీ ఓటమి నుండి తృటిలో తప్పించుకున్నారు. ఇక్కడి నుండి ఎంపీగా గెలిచిన రవింద్ర దత్తారం కేవలం 48 ఓల్ల మెజార్టీతో గెలిచి ఎంపీగా లోకసభలోకి అడుగు పెట్టబోతున్నారు. శివసేన శిండే పార్టీ తరుపున బరిలో నిలియిన ఆయన తన ప్రత్యర్థి అమోల్ గజానన్ శివసేన ఉద్దవ్ థాక్రే పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. బహుష దేశంలో రవింద్ర దత్తారందే అది స్వల్ప మెజార్టీ విజయంగా రికార్డు నమోదు చేసుకుంది కావచ్చు. 

You cannot copy content of this page