సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య…

హీరో బైక్ స్కీంలతో మోసం

తనవద్ద పనిచేసే ప్రతాపే కారణం

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి హైదరాబాద్ నగరంలో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. తన వద్ద పనిచేసే వ్యక్తి వల్ల మోసపోయి స్వగ్రామంలో అడుగుపెట్టలేని పరిస్థితి తయారు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. బాధితుడు సబ్బాని నరేష్ సెల్ఫీ వీడియోలో వివరించిన కథనం ప్రకారం… జిల్లాలోని కథలాపూర్ మండల కేంద్రంలో హీరో షోరూం నిర్వహిస్తున్న తన వద్ద పని చేసే ప్రతాప్ కారణంగా మోసపోయానని, లక్కి డ్రా ద్వారా బైకులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా అందరి వద్ద డబ్బులు వసూలు చేసిన ప్రతాప్ ఎవరికీ వాహనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు షోరూంలు ఉండి కూడా తాను తన ప్రాంత వాసుల ముందు తల ఎత్తుకునే పరిస్థితి లేకుండా తయారు చేశాడని దీంతో తాను మనో వేదనకు గురవుతున్నానని వివరించాడు. తన పేరిట షోరూం నిర్వహిస్తున్నప్పటికీ బ్యాంకు అకౌంట్ మాత్రం ప్రతాప్ పేరిట తీయడంతో లావాదేవీలు అన్ని కూడా అతని పేరిట జరిగాయన్నారు. అతని ఉమ్మడి ఆస్తిని కూడా రూ. కోటి చెల్లించి రూ. 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడని ఆరోపించారు. అయితే అందరి వద్ద వసూలు చేసిన డబ్బులు అన్ని నాకే ఇచ్చానని చెప్పి ప్రచారం చేశాడని, ఈ విషయంపై అడ్వకేట్ల సమక్షంలో కూడా పంచాయితీ జరిగిందని నరేస్ తెలిపాడు. ప్రతాప్ వద్ద రూ. కోటి 90 లక్షలు ఉన్నాయని అతనే స్కీం నిర్వహిస్తున్నందున అందులో ఎంతమంది జాయిన్ అయ్యారో, వాహనాలు ఎంతమందికి ఇచ్చాడో తనకు తెలియదని పైగా తనపైనే ఆరోపణలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు తాను ఐపీ పెడుతున్నాని ప్రతాప్ ప్రచారం చేయడంతో బంధువుల్లో పరువు పోయిందని, షోరూం యజమాని వినోద్ వద్ద రూ. 5 లక్షలు వడ్డీగా ఇచ్చాడని అయితే తాను నష్ట పోయానని డబ్బులు మంచానన్న రీతిలో ఆయన కూడా దుష్ప్రచారం చేశాడన్నారు. ఎవరో చెప్పిన విషయాన్ని నమ్మి తనపై లేనిపోని ప్రచారం చేయడం కూడా మానసిక వేదనకు కారణమని, లక్షల రూపాయల విలువ చేసే సామాను షోరూంలోనే ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేశారన్నారు. రూ. లక్ష కూడా ఇచ్చానని ఆయన కూడా తన చావుకు పరోక్ష కారణమంటూ ఆరోపించారు. తాను ఊరికి రూ. 5 నుండి 10 లక్షలు వసూలు చేసినా కోట్ల రూపాయలు అయ్యేవని వాటితో నేను పరార్ అయ్యేవాడినని కానీ నన్ను బ్లేమ్ చేస్తున్నారన్నారు. లాయర్ వద్ద లెక్కలు చేసుకుందామని చెప్తే నాలుగు రోజుల్లో వస్తానని చెప్పిన ప్రతాప్ నెల రోజులు అయినా లెక్కలు చూపకుండా తానే ఊరి నండి పరార్ అయ్యానంటూ కూడా చెప్తున్నాడన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇందుకు ప్రతాప్ ప్రధాన కారణమంటూ వ్యాఖ్యానించిన నరేష్ స్కీంల ద్వారా వసూలు చేసిన డబ్బులు ఎవరికి వారికి తిరిగి చెల్లించాలని కోరాడు. ఎదిగిన బిడ్డలను వదులుకుని వెల్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు కంటతడి పెట్టిస్తోంది. నరేష్ భార్య కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రతాప్ కారణంగానే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది.

You cannot copy content of this page