పర్వతం వద్దకు వెల్లి పళ్లు ఊడగొట్టుకున్నట్టు..?

షకీల్ తనయుడి వ్యవహారంపై సర్వత్రా చర్చ

తప్పించుకునేందుకు వేసిన తప్పటుగులు

దిశ దశ, హైదరాబాద్:

ఆయనో ఎమ్మెల్యే తనయుడు… రోడ్డుపై జరిగిన చిన్న యాక్సిడెంట్ విషయంలో అతిగా ఆలోచించాడు… ఏకంగా దుబాయ్ చెక్కేశాడు… ఎల్ఓసీ జారీ చేయించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు… కోర్టు అనుమతితో వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు… మరోకరిని నిందితునిగా పెట్టే ప్రయత్నం చేసి… దేశం పోయినా తప్పలేదు జైలు జీవితం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడి విషయంలో జరిగిన నాటకీయ పరిణామాలను గమనిస్తే వారి తొందరపాటు చర్యతో పాటు ఏమో జరుగుతుందని భావించిన తీరు స్ఫస్టంగా కనిపిస్తోంది. చిన్న కేసును అంతర్జాతీయ సమస్యగా తయారు చేసుకున్న తీరూ అందరిని ఆశ్యర్య పరుస్తోంది. పంజాగుట్టలోని ప్రజా భవన్ వద్ద అర్థరాత్రి బీఎండబ్లూ కార్ తో డివైడర్లను ఢీ కొట్టిన ఘటన జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ కారు నడుపుతున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ యాక్సిడెంట్ చేసింది తానేనని పంజాగుట్ట పోలీసుల ముందు చెప్పినట్టయితే 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించే వారు. ఆ తరువాత కోర్టులో తప్పు ఒప్పుకున్నట్టయితే కోర్టు జరిమానతో సరిపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉండేవి. అయితే ఈ చిన్న కేసు విషయంలో రాహిల్ తప్పించుకుని దుబాయికి వెళ్లడం అతని స్థానంలో తన మరో వ్యక్తిని చూపించడంతో మొదలైన కథ చివరకు ఇద్దరు సీఐలపై వేటు వేయడంతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్ కు కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గత డిసెంబర్ 24న జరిగిన రోడ్ యాక్సిడెంట్ విషయంలో 886/2023 క్రైం నంబర్ లో కేసు నమోదు అయింది. రాహిల్ తప్పించుకునేందుకు చేసిన తప్పిదాల వల్ల ఈ కేసులో ఐపీసీ 308, 419, 279, 201, 203, 212, 213, 214, 217, 218, 225A, 225 B, 182 r/w 109, 34 సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాహిల్ తనపై ఉన్న లూక్ ఓటౌ నోటీసులను విరమించేందుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. నోటీసులు రద్దు చేయాలనడంతో పాటు పోలీసుల ముందు లొంగిపోవాలని హైకోర్టు గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయిన రాహిల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా అతనికి ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించామని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల ముందు రాహిల్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని కూడా వివరించారు.

You cannot copy content of this page