తన దీనస్థితిని చెప్పుకున్న స్టార్ కమెడియన్.. గొప్ప మనసు చాటుకున్న మెగా బ్రదర్

ఒకప్పుడు వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన చాలా మంది తారలు ఇప్పుడు కనుమరుగై పోయారు. ఎవరూ గుర్తుపట్టలేనంతలా వారి జీవితాలు తయారయ్యాయి. అలాంటి వాళ్లల్లో కమెడియన్ పాకీజా ఒకరు. పాకీజా అలియాస్ వాసుకి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా 150 సినిమాలు తీసి వెండి తెరపై లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈమె కూడా ఒకరు. అప్పటిలో ఆమె కామెడీ కోసం సినిమాకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమెకు తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

పాకీజా మాట్లాడుతూ.. తన దీన పరిస్థితి గురించి చెప్పుకుని బాధపడింది. అంతే కాదు తనకు తమిళ సినిమా సంఘాలు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని తెలిపింది. ఎంతో కొంత సహాయం చేశారంటే అది తెలుగు ప్రజలే అని చెప్పుకొచ్చారు పాకీజా. అయితే ప్రస్తుతం ఆమెకు ఓ పూట తినడానికి కూడా చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమిళ ఆర్టిస్ట్ సంఘాలు కానీ.. నడిగర్ సంఘం కానీ తనను పట్టించుకోలేదు వాపోయింది. చివరకు సూపర్ స్టార్ రజనీ కాంత్, సీఎం తనయుడు నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు తన పరిస్థితిని చెప్పానని అయినా ఉపయోగం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది స్పందించారు. వీరిలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు.

నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వంతు సహాయంగా రూ. 1 లక్ష ఆర్థికసాయాన్ని పాకీజాకు ప్రకటించారు. అంతే కాకుండా సాధ్యమైనంత వరకు అవకాశాలు వచ్చేలా చేసి తన కాళ్లపై తాను నిలబడేలా చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. బుల్లి తెరపై కానీ, వెండి తెరపై కానీ చిన్నో పెద్దో పాత్ర వచ్చేలా చేస్తే ఆమె మళ్లీ తన కాళ్లపై నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనవంతు ప్రయత్నం కూడా చేస్తానన్నారు. అంతే కాకుండా ఇంటర్వ్యూలో స్వయంగా వీడియో కాల్ చేసి పాకీజాతో మాట్లాడారు. పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం ఎంతో బాధగా ఉందన్నారు నాగాబాబు. కాగా.. చిరంజీవి తమ్ముుడు నాగబాబు తనకు సహాయం చేశారని పాకీజా ఎంతో సంతోషించింది.

You cannot copy content of this page