అంత్యక్రియలతోనే సరి… శ్రాద్ద కర్మలు ఉండవు మరి…

భీముని పండగ తరువాత సామూహిక కార్యక్రమాలు…

దిశ దశ, దండకారణ్యం:

పూర్వీకుల నుండి వచ్చే సాంప్రాదాయాలు పాటించేందుకే వారసులు ప్రాధాన్యత ఇస్తుంటారు. వారసత్వంగా వచ్చే ఆచార వ్యవహారాలను పాటించేందుకే చాలామంది మొగ్గు చూపుతుంటారు. ఈ విధానం కేవలం పండగలు, వేడుకలు జరుపుకునేప్పుడే కాకుండా ఆఖరి మజిలీ విషయంలోనూ ఇదే విధానం కొనసాగిస్తుంటారు చాలామంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో మరణించిన తమ కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ వివిధ పద్దతులను పాటిస్తుంటారు. భారతదేశంలో కూడా తమతమ సాంప్రాదాయాలకు అనుగుణంగా చనిపోయిన తమ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మతాల వారిగా వారి ఆచారా వ్యవహారాలను పాటిస్తుంటారు. అయితే చాలా మంది కూడా మరణించినప్పటి నుండి పది నుండి పదిహేను రోజుల్లోగానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారి వారి ఆనవాయితీలను బట్టి ఈ ప్రక్రియను ఏటేటా కూడా కొనసాగిస్తుంటారు కొంతమంది. మరికొంతమంది చనిపోయిన తరువాత పది పదిహేను రోజుల్లోగా ఆచారాలను పాటించి వదిలేస్తుంటారు. అయితే ఈ ఆదివాసీలు మాత్రం విచిత్రమైన పద్దతులు పాటిస్తున్నారు. చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతం నుండి తెలంగాణ సరిహద్దుల్లోకి దశాబ్దాల క్రితం వలస వచ్చిన వీరు చనిపోయిన తమ కుటుంబ సభ్యుల కోసం చేపడుతున్న ఆనవాయితీ వైవిద్యంగా ఉంది.

ఆ పండగ తరువాతే…

చత్తీస్ గడ్ అటవీ ప్రాంతం నుండి భద్రాద్రి కొత్తగూడె జిల్లా చర్ల ప్రాంతానికి సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఆదివాసీ కుటుంబాలు కొన్ని వలస వచ్చాయి. కందిపాడు గ్రామంలో నివసిస్తున్న సుమారు 250 కుటుంబాలకు చెందిన వీరు తమ కుటుంబీకులు మరణిస్తే పాటించే ఆచార వ్యవహారాలను అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఆదివాసీ కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి అంత్రక్రియల తంతు పూర్తి చేయడంతో సరిపెడ్తారు. ఏటా ఫిబ్రవరి నెల చివర్లో తమ సాంప్రాదాయంలో భాగంగా భీముని పండగ నిర్వహిస్తారు. భీముని పండగ తరువాత చనిపోయిన వారికి అఖరి మజిలీ నిర్వహించే ఆదివాసీలు యథావిధి జీవనం సాగిస్తుంటారు. భీముని పండగ సందర్భంగా వేడుకు చేసుకున్న తరువాత ఆ ఏడాదిలో చనిపోయిన వారికి సంబంధించిన శ్రాద్ద కర్మలను చేస్తుంటారు. ఆ ఏడాది గ్రామంలో చనిపోయిన వారందరికి ఏక కాలంలో ఈ తంతును పూర్తి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఇదే విధానంతో మార్చి 5వ తేది మంగళవారం కందిపాడు గ్రామ ఆదివాసులు మరణించిన తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన కర్మకాండలను పూర్తి చేశారు. గ్రామంలో గత సంవత్సంర మొత్తం ఆరుగురు మృత్యువాత పడగా వారి అంత్ర్యక్రియలు నిర్వహించిన శ్మశాన వాటిక వద్దకు చేరుకున్న ఆదివాసీలు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శ్మశాన వాటికలో అంత్రక్రియలు నిర్వహించిన చోట మరణించిన వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి శ్మశానంలో ఉంచడంతో పాటు కళ్లును కూడా అక్కడే ఉంచి చనిపోయిన వారి ఆత్మ తృప్తి కోసం కర్మకాండ తంతును పూర్తి చేశారు. చనిపోయిన తమవారిని గుర్తుకు తెచ్చుకుని కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఊరంతా అక్కడే…

అయితే కందిపాడు ఆదివాసీలు సాంప్రాదాయంగా ఆచరిస్తున్న ఈ విధానంలో కేవలం చనిపోయిన వారి కుటుంబ సభ్యులకే పరిమితం కాదు. గ్రామంలోని ఆదివాసి కుటుంబాలన్ని కూడా శ్మశాన వాటికకు చేరుకుని మరణించిన వారిని స్మరించుకుంటుంటారు. ఈ సందర్భంగా ఆదివాసి కుటుంబాలన్ని కూడా ఈ తంతులో పాల్గొని ఆ ఏడాది చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తుంటారు. చనిపోయిన తరువాత కర్మ కార్యాలు నిర్వహించడానికి భిన్నంగా కందిపాడు ఆదివాసీలు ఆ ఏడాదిలో చనిపోయిన వారందరికి కలిపి సామూహికంగా శ్రాద్ద కర్మలు చేయడమే ప్రత్యేకత.

You cannot copy content of this page