జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు
దిశ దశ, పెద్దపల్లి:
ఇటుక బట్టీల్లో బంధీ అయిన కార్మికులను విముక్తి చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కార్మికులు బట్టీల యజమానుల నిర్భందంలో చిక్కుకపోయిన వారిని రక్షించారు. శనివారం సీఐడీ, సివిల్ పోలీసులు, రెవెన్యూ, లేబర్ విభాగాలకు చెందిన అధికారుల బృందం జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 9 మందికి విముక్తుల్ని చేసింది. వివరాల్లోకి వెల్లే… కరీంనగర్ రీజియన్ సీఐడీ ఇన్స్ పెక్టర్లు పి విజయ్ కుమార్, బి తిరుపతిరెడ్డి, ఎస్సై మల్లేశం, ఏఎస్ఐ కె పద్మ, హెచ్ సి చంద్రశేఖర్ రావు, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత్ నగర్ ఎస్సై శ్రీనివాస్, పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జె రాములు, ఇంఛార్జి ఛైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి జితేందర్, రెవెన్యూ ఇన్సెపెక్టర్ నవీన్ రావులు రంగాపూర్ లోని జీఎస్ఆర్ ఇటుక బట్టీపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది వలస కార్మికులను జీఎస్ఆర్ ఇటుక బట్టీ యజమాని అక్రమ నిర్భంధం చేసుకున్నారని గమనించి వారిని విముక్తి కల్పించారు. బట్టీ నుండి నైల బరిక్ (53), లాబా బెన్యూయన్ (53), సుపూర్ బెన్యూయన్ (19), నువ్ర బరికి (50), సీమా బరిక్ (22), రశ్మిత బరిక్ (17), ఉదియాన్ బెన్యూయన్ (48), పుష్ప బెన్యూయన్ (19), 15 ఏళ్ల మైనర్ బాలికను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరిని ఒరిస్సాలోని బొలంగిర్ జిల్లా కేండుముంది గడియాజోర్ గ్రామానికి పెద్దపల్లి నుండి ట్రైన్ లో పంపించారు.
