దిశ దశ, కరీంనగర్:
ఈ నెల 13న జరగనున్న లోకసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభోలాకు గురి చేసేందుకు సన్నద్దమవుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. 11వ తేది నుండి ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో చీరెలు తరలిస్తున్న వాహనం పోలీసులకు దొరకడం గమనార్హం. కరీంనగర్ పోలీసుల దాడుల్లో దొరికిన ఓ వాహనంలో చీరెలు లభ్యం కావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈకో వాహనంలో తరలిస్తున్న 400 చీరెలను కరీంనగర్ టౌటౌన్ సీఐ విజయ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో దొరికాయి. టీఎస్ 13, ఈబి 2549 అనే నెంబరు గల ఈకో వాహనంలో తరలిస్తున్న రూ. 3 లక్షల విలువైన 400 చీరెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎలాంటి బిల్లులు కూడా లేవని పోలీసులు తెలిపారు. ధర్మపురికి తరలిస్తున్న క్రమంలో కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద పట్టుకున్నామని వెల్లడించారు.